BigTV English

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి షాక్.. ప్రేమ రహస్యం బయటపెట్టిన నర్మద.. రామరాజు దెబ్బకు భాగ్యంకు షాక్..

Illu Illalu Pillalu Today Episode: శ్రీవల్లికి షాక్.. ప్రేమ రహస్యం బయటపెట్టిన నర్మద.. రామరాజు దెబ్బకు భాగ్యంకు షాక్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode October 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. భద్ర విశ్వం శ్రీవల్లితో మాట్లాడటం నర్మదా చూస్తుంది. వేసిన శ్రీవల్లి లోపలికి రాగానే ఏంటి వాళ్లతో మాట్లాడుతున్నావు? ఎదురింటి వాళ్ళతో నీకేం పని? మావయ్య గారి గురించి వాళ్ళు చండాలంగా మాట్లాడుతున్నారు అందుకే వార్నింగ్ ఇస్తున్నాను అని శ్రీవల్లి అంటుంది. నర్మదకు మాత్రం ఎక్కడో డౌట్ కొడుతుంది. నీ ముందరే వాళ్లకు వార్నింగ్ ఇచ్చాను కదా మరి నువ్వు నమ్మవేంటి నమ్మాలి బాబా అని శ్రీవల్లి అంటుంది. ఏదో జరుగుతుంది అది గనక తెలిస్తే నీ ఆట కట్టిస్తాను అని శ్రీవల్లికి నర్మదా వార్నింగ్ ఇస్తుంది. అయ్యబాబోయ్ ఎవరికి దొరకకూడదు వారికే దొరికేసానుగా జరనుంటే నన్ను ఇంట్లో నుంచి గంటసేవాళ్ళు అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది.


ఇక లోపలికి వెళ్లి పూజ చేసి దేవుడిని వింత కోరికలు కోరుతుంది. ఆ తర్వాత కాఫీ పెట్టి చందు కి ఇస్తుంది.. చందు మాత్రం శ్రీవల్లిని దూరం పెట్టడంతో బాధపడుతుంది. మా వాళ్ళు చేసిన తప్పుకి అమాయకురాలు అయిన నన్ను పెళ్లి చేసావేంటి బావ నేనేం చేశాను అని బాధపడుతుంది. చందు శ్రీవల్లి బాధను చూసి ఓర్వలేక దగ్గరకొచ్చి ముద్దు పెట్టేస్తాడు. ఆ ఆనందం తట్టుకోలేని శ్రీవల్లి బయటకొచ్చి మా ఆయన ముద్దు పెట్టాడో అంటూ కేకలు వేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వేదవతి నర్మదా ప్రేమ ముగ్గురు కూడా శ్రీవల్లి ప్రవర్తనతో షాక్ అవుతారు. మీ ఆయన నీకే కదా ముద్దు పెట్టింది. అదేదో చేయకూడని పని చెప్పుకోలే నీది అన్నట్లుగా అంతగా అరుస్తున్నావ్ ఏంటి అని నర్మదా అడుగుతుంది. మా ఆయన కూడా నాకు రాత్రి ముద్దు పెట్టాడు అదేమైనా నేను చెప్పుకున్నానా? అంతెందుకు అత్తయ్యకు మావయ్య ఎన్నోసార్లు ముద్దు పెట్టి ఉంటాడు అది చెప్పిందా? మొన్న బ్యాచిలర్ పార్టీకి వెళ్ళిన ప్రేమ కు ధీరజ్ ముద్దు పెట్టాడు ప్రేమ చెప్పుకుందా? నువ్వెందుకు ఇలా చంకల గుద్దుకుంటున్నావో అర్థం కావడం లేదు అని శ్రీవల్లి పరువు తీయడంతో పాటుగా వేదవతిని ఇరికిస్తుంది నర్మదా..


వేదవతి నువ్వేంటే నా మీద పడ్డావు నన్నే ఇరికించవెంటే అడ్డంగా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. నీతో చేరితే నేను కూడా మీలాగా మారిపోతానేమో నేను వెళ్ళిపోతాను అని వేదవతి అంటున్న సరే నర్మదా కూర్చొని అత్తయ్య అని అంటుంది. మొత్తానికి శ్రీవల్లికి సంతోషంగా ఉన్నా సరే నర్మద ఇచ్చిన క్లాస్ తో శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. ధీరజు ప్రేమకు ముద్దొచ్చాడా? శ్రీవల్లి నువ్వు లోపలికి వెళ్ళు అని వేదవతి హిందీలో చెప్తుంది. నర్మదను ఆ ముద్దు గురించి అడుగుతుంటే ప్రేమ సిగ్గు పడుతుంది. మొత్తానికి ప్రేమ గురించి వేదవతికి నర్మదా పూస గుచ్చినట్లు అంతా చెప్పేస్తుంది.

ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్తుంది అయితే ధీరజ్ ప్రేమ మాట్లాడకపోవడంతో ఎలాగైనా సరే తనని మాట్లాడించాలని ఐశ్వర్య ఫోన్ చేసినట్టు నాటకం ఆడుతాడు. ఇప్పుడే వస్తున్నాను రెడీ అవుతున్నాను అని అనడంతో ప్రేమ ఆ ఇసుకడ్డ దగ్గరికి వెళ్తున్నావా ఎలాగైనా సరే దాన్ని ఒక పట్టు పట్టి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి అని అనుకుంటుంది. ధీరజ్ ఫోన్ ని ఎంతగా ట్రై చేసినా సరే పాస్వర్డ్ ఓపెన్ కాకపోవడంతో ధీరజ్నే అడుగుతుంది. నా ఫోన్ గురించి నీకెందుకు అని ధీరజ్ అంటాడు ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ టచ్ మొదలవుతుంది.

నువ్వు నాతో మాట్లాడకుండా ముడుచుకుని కూర్చున్నావు కదా అందుకే నీ చేత మాట్లాడించడానికి ఈ ప్లాన్ చేశానని ధీరజ్ అనుకుంటాడు.. ఇక బాగ్యం ఆనందరావు రామరాజు ఎందుకు పిలిచాడా అని టెన్షన్ పడుతూ ఇంటికి వస్తారు. ఇంట్లోకి రాగానే రామరాజు రావడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. ఎందుకు పిలిచారో ఏంటో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. మీరు మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేశారు అలాంటిది మీరు కష్టపడుతూ ఉంటే నేను ఎలా చూడగలను మీరు ఏదైనా హోటల్ పెట్టుకోవడానికి నేను సాయం చేస్తాను అని రామరాజు అంటాడు.

కానీ ఆనందరావు మాత్రం మేము స్వయంకృషితో పైకి వస్తాము. ఇడ్లీలతో ఫైనాన్స్ బిజినెస్ చేస్తాము అని కోతలు కోస్తాడు. రామరాజు ఎంత చెప్తున్నా సరే ఆనందరావు వినకపోవడంతో రామరాజు మీ పట్టుదలతోనే మీరు సాధిస్తారు బావగారు అని ఇవ్వాల్సిన డబ్బులు పెట్టేస్తాడు.. ఆనంద్ రావు భాగ్యం చేతిలో ఎక్కడ తన్నులు తినాలని అక్కడి నుంచి మెల్లగా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ భాగ్యం మాత్రం బయటికి రాగానే ఆనందరావుని చితగ్గొట్టేస్తుంది.

Also Read : అవనిని అవమానించిన పల్లవి.. భానుమతి క్లాస్.. పల్లవికి షాకిచ్చిన అవని..

తర్వాత రోజు ధీరజ్ కొత్త జాబ్ లో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతుంటాడు. ప్రేమ నాకు కుడి కన్ను అదిరింది ధీరజ్ నువ్వు ఈరోజు వెళ్లొద్దు అని అంటుంది. కొత్తగా ఇవాళ నేను జాబ్ లో జాయిన్ అవుతున్నాను అలాంటిది వెళ్ళొద్దని అంటావు నీకేమైనా పిచ్చా అని అంటాడు. నాకు కుడికన్ను అదురుతుంది ఏదో కీడు సంఖ్యేస్తుంది నువ్వు వెళ్ళద్దు అని బ్రతిమలాడుతుంది.. నువ్వు నీ మూఢనమ్మకాలు అని ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రేమ ఎంతగా ఆపాలని ప్రయత్నించినా సరే ధీరజ్ ప్రేమని పక్కకు నెట్టేసి వచ్చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Jabardast: 200 కోట్ల ఆస్తికి అధిపతి.. ఒక్క దెబ్బతో క్లారిటీ ఇచ్చి జబర్దస్త్ కమెడియన్!

Nindu Noorella Saavasam Serial Today october 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను అవైడ్‌ చేస్తున్న పిల్లలు

Intinti Ramayanam Today Episode: అవనిని అవమానించిన పల్లవి.. భానుమతి క్లాస్.. పల్లవికి షాకిచ్చిన అవని..

Brahmamudi Serial Today October 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజ్‌ ను మార్చేందుకు కనకం ప్లాన్‌

GudiGantalu Today episode: మీనాను అవమానించిన ప్రభావతి.. సత్యం షాకింగ్ నిర్ణయం..మనోజ్ ను ఇరికించిన బాలు..

Gundeninda Gudigantalu : ‘గుండెనిండా గుడి గంటలు ‘ బాలు లవ్ స్టోరీ లో ఊహించని ట్విస్టులు..

Telugu TV Serials: ఈ వారం టీవీ సీరియల్స్ రేటింగ్స్.. టాప్ లో కొత్త సీరియల్..?

Big Stories

×