Intinti Ramayanam Today Episode October 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. బయట నిల్చున్న పల్లవి కమల్ అన్న మాటలను వింటుంది. భార్య మీద ప్రేమ ఉన్నోడు ఎవడు ఇలా మాట్లాడడు.. నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీ దృష్టిలో నేను ఏంటో అర్థం అయిపోయింది. అందుకే నువ్వు నన్ను ఇంట్లోకి రానివ్వడం కాదు. నేనే నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని వచ్చానని పల్లవి అంటుంది. పల్లవి ఇచ్చిన డివోర్స్ నోటీస్ చూసి కమల్ షాక్ అవుతాడు.. అవని ఆ నోటీసులు తీసుకొని నువ్వు కమల్ కి విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావా? కొంచమైనా మతి ఉండి ఆలోచించు అని అందరూ పల్లవిని అంటారు. పల్లవిని అందరూ తలా ఒక మాట అంటారు.
తొందరపడి జీవితాలని నాశనం చేసుకోవద్దు అని సలహా ఇస్తారు. ఎన్ని మోసాలు చేసినా అవనీని ఇంట్లో ఉంచుకున్నారు కానీ నన్ను మాత్రం బయటికి గెంటేశారు. ఇది నాకు చాలా అవమానంగా అనిపించింది అని పల్లవి కావాలనే పదేపదే అవనీని ఇరికించాలని అనుకుంటుంది. మొత్తానికి అందరూ చెప్పడంతో కన్విన్స్ అయినట్టు నాటకం ఆడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ప్రణతి ఇంట్లో జరుగుతున్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పల్లవి వదిన శ్రేయ వదిన ఇద్దరు కూడా అవని వదినని అవమానించాలని ఈ ఇంట్లోకి మళ్లీ వచ్చారు.. ఇంట్లో వాళ్ల కోసం అవని వదిన పడుతున్న కష్టాల గురించి మనం చూస్తూనే ఉన్నాం కదా మళ్లీ వీళ్ళు ఆమెని ఇంకా బాధ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. నాకు అదే భయంగా ఉంది భరత్ అని ప్రణతి అంటుంది. వాళ్లు కచ్చితంగా వచ్చింది అందుకే.. మనల్ని కూడా వాళ్ళు అవమానిస్తారు కానీ నువ్వు పట్టించుకోవద్దు అని భరత్ అంటాడు. అన్న సంగతి పక్కన పెట్టు ఇన్నాళ్ల తర్వాత కలుసుకున్న అన్న వదినల మధ్య మళ్లీ గొడవలు పెడతారేమో అని నాకు భయంగా ఉంది అని ప్రణతి అంటుంది.
అక్క జోలికొస్తే అస్సలు ఊరుకునేది లేదు అని భరత్ అంటాడు.. ఇక శ్రీయా పల్లవి ఇద్దరు కూడా.. నేను మేము ఏం చేసినా ఒక ప్లాన్ ప్రకారం చేస్తాం కాబట్టి మన ఇద్దరి టార్గెట్ అవని. అవని గురించి ముందు ఆలోచిద్దాం అని ఇద్దరు మళ్లీ కలిసిపోతారు. మనల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేలా చేసిన ఆ అవనీని మనం ఇంట్లో లేకుండా చేయాలి అని పల్లవి అంటుంది. ఇక అందరిని భోజనానికి రమ్మని అవని పిలుస్తుంది. అయితే అందరికీ వడ్డించాలని ప్రణతి అవని ఇద్దరూ అన్ని సిద్ధం చేసి పెడతారు. ప్రణతి రాజేంద్రప్రసాద్ కి ఉప్పు తక్కువ వేసిన వాటిని వడ్డించమని అవని చెప్తుంది.
ఇక పల్లవి శ్రియాలు ఇద్దరు అప్పుడే వస్తారు. పల్లవి శ్రియ వచ్చి కూర్చోండి అని అవని అంటుంది. మేము కూర్చోవాలో లేదో కూడా నువ్వు చెప్పాలా నువ్వు చెప్తేనే నేను కూర్చోవాలా అని పల్లవి అంటుంది.. ఇక అందరికీ వడ్డిస్తుంటే ఏం చేసావ్ కూరలు అని శ్రియ అడుగుతుంది.. పప్పు సాంబారు రోటి పచ్చడి ఊరగాయ ఇవే కదా ఏదైనా వెరైటీగా చేయొచ్చు కదా అని అడుగుతారు. ఇప్పుడు మనం అన్ని వెరైటీలు చేసుకోవడానికి అప్పుడున్న పరిస్థితుల్లో లేము అందుకే ఇప్పుడు ఉన్న వాటిలో సర్దుకుపోవాలి అని అవని అంటుంది. కానీ పల్లవిశ్రియాలు మాత్రం తినడానికి కూడా గతి లేకుండా చేస్తున్నవేంటి అని దారుణంగా అవమానిస్తారు.
అప్పుడే మేడం ఆర్డర్ అంటూ డెలివరీ బాయ్ వాళ్లకి ఫుడ్ తీసుకుని వచ్చి ఇస్తాడు. పార్వతి ఏంటమ్మా అది అని అడుగుతుంది. శ్రియ చాలా పొగరుగా కనిపించట్లేదా చికెన్ బిర్యానీ అని అంటుంది. ఇంట్లో అవని అందరికోసం భోజనం చేసింది కదా మళ్లీ మీరు బయట నుంచి తెప్పించుకోవడం అవసరమా అని పార్వతి అంటుంది. కానీ పల్లవి మాత్రం మీరు ఏది పెడితే అది తినడానికి మేము మనుషులం అని అవమానిస్తుంది. మీరందరూ కూడా తింటున్నారు అని మేము ఏది పడితే అది తినాలని అడుగుతారు.
బిర్యాని చాలా బాగుందని ఆహా ఓహో అంటూ బట్టలు వేసుకుంటూ పల్లవి శ్రియ ఇద్దరు తింటారు. అని మాత్రం మామయ్య ముందర ఏమి చెప్పకుండా ఉంటే బెటర్ అని మనసులో కోపాన్ని దాచుకుంటుంది.. రాజేంద్రప్రసాద్ వదిలేయమ్మా అవని కుక్క తోక వంకర అని అంటారు కదా అది గుర్తుపెట్టుకో అని అంటారు. అయితే పల్లవి మేము కుక్కలం అంటున్నారా అని అడుగుతుంది.. నేను మిమ్మల్ని అనలేదు అమ్మ నేను సామెతను మాత్రమే చెప్పాను అని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఆరాధ్య పల్లవిని నాకు చికెన్ అంటే చాలా ఇష్టం పిన్ని నాకు చికెన్ పెట్టరా అని అడుగుతుంది..
Also Read: మీనాను అవమానించిన ప్రభావతి.. సత్యం షాకింగ్ నిర్ణయం..మనోజ్ ను ఇరికించిన బాలు..
పల్లవి పసిపిల్ల అని కూడా చూడకుండా ముష్టి వాడికి విసిరేసినట్టు విసిరేస్తుంది. దాంతో అవని చాలా బాధపడుతుంది. ఆరాధ్య తినబోతుంటే అవని వద్దని అంటుంది. వద్దమ్మా అని ఆరాధ్య తో అవని అంటుంది. మనుషులకి మనుషుల్లాగే ఇవ్వాలి ఏదో ముష్టి వాడికి విసిరేసినట్టు వేశావు అని అనుకోకుండా అడుగుతుంది అవని.. అయితే ఇక పల్లవి దగ్గరికి వెళ్లి అవని నువ్వు చేసిన విషయాల గురించి కమల్ కు చెబితే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో అది గుర్తుపెట్టుకుని ఇంట్లో ప్రవర్తించు అని అంటుంది. అక్షయ్ ఇంటికి రాగానే ఏమైంది అని అడుగుతాడు. అవని ఏ మాట చెప్పదు. శ్రియ పల్లవిలు ఎలా ఉంటారో నేను అర్థం చేసుకోగలను నాన్న కోసం నువ్వు అర్థం చేసుకో.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…