Gundeninda GudiGantalu Today episode October 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. కోపంగా వచ్చిన బాలు ఏమైంది అని అడుగుతాడు.. రోహిణి మీరు గొప్పలకు పోయే డబ్బులు ఇస్తామన్నారు ఎక్కడి నుంచి తెచ్చిస్తారు అని ఎగతాళి చేస్తూ మాట్లాడిందని బాలుతో మీనా అంటుంది. రోహిణి అన్నది కూడా నిజమే కదా మనం అంత డబ్బులు ఎలా తెచ్చి ఇస్తాము అని అంటుంది. మీనా మాట వినగానే నువ్వే నా ఈ మాట మాట్లాడుతున్నావు. మనకేమీ చేతకాదా కష్టపడుతున్నాం కదా మనమే డబ్బులు అందరికన్నా ముందు ఇస్తాం అని బాలు అంటాడు. మనల్ని చులకన చేసి మాట్లాడుతున్నప్పుడు మనం ఇవ్వడం ఎందుకండీ అని బాలతో అంటుంది మీనా.. ఈ తలనొప్పి తగ్గాలంటే నువ్వు నాకు ఒకటి ఇవ్వాలి అని బాలు అంటాడు. తర్వాత రోజు దీపావళి సందర్భంగా ఇంట్లో సంబరాలు మొదలవుతాయి. మీనా ఉదయాన్నే లేచి బయట ముగ్గు వేసి దీపావళి పండుగకు అంత సిద్ధం చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. స్తుతి వాళ్ళమ్మ దీపావళి పండక్కి అల్లుని తీసుకొని ఇంటికి రమ్మని పిలుస్తుంది. మా అమ్మ ఇంటికి రమ్మని పిలుస్తుంది రవి అని శృతి అంటుంది. అదేంటి ఇంటికి పిలవాలంటే నాకు ఫోన్ చేసి పిలవాలి కదా నీకు ఫోన్ చేసి తెలుస్తుంది ఏంటి అని రవి అంటాడు. అల్లునికి ఫోన్ చేసి పిలవడం మర్యాద అని రవి అంటాడు. ఏదైతే ఏమి నాకు చేసింది కదా మనల్ని రమ్మని పిలుస్తుంది వాళ్లకి కూడా ఏవో ఒక ముచ్చట్లు ఉంటాయి కదా అని అంటుంది శృతి. బాలు మాత్రం మనం ఇక్కడే మా పండగ చేసుకుందామని అంటాడు..
మా అత్తగారు ఫోన్ చేసి రమ్మని పిలిచినా కూడా నేను వెళ్ళను అని బాలు అంటాడు అత్తగారు ఫోన్ చేసి రమ్మని పిలిచినా కూడా నేను వెళ్ళను అని బాలు అంటాడు. అబ్బో మీ అత్తగారు పెద్ద గొప్పగా చేసేవాళ్ళు లే ఆడపించినా ఒకటే పిలవకపోయినా ఒకటే అని ప్రభావతి మీన వాళ్ళ కుటుంబాన్ని దారుణంగా అవమానిస్తుంది.. మేము అంత గతి లేని వాళ్ళమైతే కాదు. మాకు చిన్నప్పటినుంచి మీరే మమ్మల్ని పెంచినట్టు మాట్లాడతారే.. ఏరోజైనా మీరు మా ఇంటికి వచ్చి చూశారా మైండ్ ఎలా ఉందో అని మీనా ప్రభావతికి దిమ్మతిరిగిపోయే క్లాస్ ఇస్తుంది.
సత్యం ఏమైంది అని బాలుని అడుగుతాడు. బాలు సత్యంకి ప్రభావతికి మీనా దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ ఇచ్చింది నాన్న అని అంటుంది.. కాసేపయ్యాక రంగ ఇద్దరు మనుషులను తీసుకొని వస్తాడు.. అందరూ పైకి వెళ్లి ఇంటిని కొలుస్తూ ఉంటారు. మనోజ్ ఇంటి అమ్మేస్తున్నారా అని అంటుంది. లేదు ఈ గదిని కట్టడానికి 5 లక్షలు అవుతుంది అని వాళ్ళు చెప్పగానే అందరూ షాక్ అవుతారు.. కిందికి రాగానే ఇంట్లో అందరూ పంచాయతీ పెడతారు. ఐదు లక్షల కట్టి ఈ దిక్కుమాలినోలకి గది కట్టించాల్సిన అవసరం ఏంటి అని ప్రభావతి అంటుంది.
మేము దిక్కుమాలినోళ్లు మేం కాదు మాకు పిన్ ఉండేది చిన్నప్పటినుంచి మా అమ్మమ్మ మా మమ్మల్ని సమానంగా చూసేది. ఆ కొడుకు వేరు ఈ కూతురు వేరు అని ఎప్పుడు చూసేది కాదు అని మీనా అంటుంది. నా భర్తని డ్రైవర్ డ్రైవర్ అని అంటున్నారు కదా నీ భర్త ఒకప్పుడు డ్రైవర్ ఏ కదా ఆయన సంపాదించి ఇస్తేనే నువ్వు ఇంటిని గడిపావు పిల్లల్ని పోషించావు కదా ప్రతిసారి మాయన్న అంటే ఊరుకునేది లేదు అని మీనా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. ఇక ఇంట్లో దీపావళి సంబరాలు ను మొదలుపెడతారు.
Also Read : ‘గుండెనిండా గుడి గంటలు ‘ బాలు లవ్ స్టోరీ లో ఊహించని ట్విస్టులు..
ప్రభావతితో సహా అందరూ కూడా దీపావళి కోసం పూజలు చేస్తారు. ఇంట్లో ఎంతో సందడి వాతావరణం నెలకొంటుంది. సత్యం తమ ముగ్గురు కోడళ్ళకు దీపావళి కానుకలు ఇస్తాడు. ముగ్గురు కలిసి ఎరుపు రంగు చీరలో పూజకు వస్తారు. ఇంటిని పూలతో ముస్తాబు చేయడంతో పాటుగా దీపాలతో ఎంతో చక్కగా అలంకరిస్తారు. ఇక అందరూ సరదాగా పూజను మొదలు పెడతారు. పూజ పూర్తవ్వగానే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు. పండగ రోజు పూలకు మంచి డిమాండ్ ఉంటుందని మీనా ఈరోజు చేస్తే మనకి మంచిగా డబ్బులు వస్తాయని బాలుతో అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రోహిణి నీ కిడ్నాప్ చేసేందుకు దినేష్ ప్లాన్ చేస్తాడు.. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..