Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ మీద పిల్లలకు కోపం వచ్చేలా రెచ్చగొడుతుంది మనోహరి. రేపు మిస్సమ్మకు బిడ్డ పుట్టాక మీ పరిస్థితి ఏంటని రూంలోకి వెళ్లి చెప్తుంది. దీంతో పిల్లలు ముగ్గురు ఆలోచనలో పడిపోతారు. మరోవైపు మిస్సమ్మ తాను అబార్షన్ చేయించుకోవడానికే మొగ్గు చూపుతుంది. దీంతో రాథోడ్ మరోసారి ఆలోచించుకోమని చెప్తాడు. అయితే అమర్‌ను ఎలాగైనా ఒప్పించి అబార్షన్ చేయించుకుంటానని మిస్సమ్మ చెప్తుంది. ఇక యమలోకంలో ఉన్న ఆరుకు యముడు వచ్చి నిజం చెప్తాడు. నీ పునర్జన్మలో నువ్వు పిండంగా ఉండగానే.. మరణం వస్తుందని అందుకోసమే నీకు పునర్జన్మ లేదని చెప్పగానే.. ఆరు బాధపడుతుంది. గుప్త వచ్చి ఓదార్చినా ఆరు వినదు.. మీరంతా కలిసి అబద్దం చెప్పి నన్ను నా ప్యామిలీకి దూరం చేశారు అంటూ ఎమోషనల్ అవుతుంది. మీకు జాలి, దయ, కరుణ, ప్రేమ అనేవి ఉండవా అంటూ నిలదీస్తుంది. దీంతో గుప్త యముడిని తిట్టబోతుంటే అప్పుడే యముడు వస్తాడు. అంతా విధి ప్రకారం జరుగుతుందని.. ఆ విధిని మార్చడం ఆ విధాత వల్లే అవుతుందని కానీ ఆ విధిని ఏమార్చడం మానవులకు అలవాటు అయిందని చెప్తాడు. దీంతో ఆరు కోపంగా యముడిని తిడుగుతుంది. దీంతో యముడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇక కింద పిల్లుల ముగ్గురూ స్కూల్‌కు రెడీ అయి హాల్లోకి వెళ్తారు. అక్కడ మిస్సమ్మ పిల్లల కోసం ఎదురుచూస్తుంది. పిల్లలు మిస్సమ్మను చూసి మనోహరి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటారు. మిస్సమ్మకు బిడ్డ పుట్టగానే.. మిమ్మల్ని దూరం పెడుతుందని.. ఇంకా చెప్పాలంటే.. మీ మీద మీ డాడీకి కూడా ప్రేమ తగ్గేలా చేస్తుందని చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ చూస్తుంటారు. ఇంతలో మిస్సమ్మ ఏంటి పిల్లలు ఎందుకు డల్లుగా ఉన్నారు.. ఏమైంది అని అడుగుతుంది. పిల్లలు పలకరు..దీంతో అంజును ఏమైంది నువ్వైనా చెప్పు అని అడగ్గానే.. అంజు ముక్తసరిగానే ఏం లేదు మిస్సమ్మ అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ సరే అయితే పదండి నేను వచ్చి మిమ్మల్ని స్కూల్ లో డ్రాప్ చేసి వస్తాను అంటుంది. దీంతో అమ్ము కోపంగా మిస్సమ్మ చేతిలో బ్యాగ్ లాక్కుంటుంది. ఏమీ అక్కర్లేదు.. మేము వెళ్లగలం.. నువ్వు రావాల్సిన అవసరం లేదు అంటూ చీదరించుకుంటుంది. దీంతో మిస్సమ్మ షాక్ అవుతుంది. ఎందుక అమ్ము ఏం జరిగింది. నేను ఎందుకు రాకూడదు మిమ్మల్ని డ్రాప్ చేయడానికి అని అడుగుతుంది.
దీంతో అమ్ము మరింత కోపంగా మాకు అంతా తెలుసు.. నువ్వు చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అంటూ కోప్పడుతుంది. దీంతో పక్కనే రాథోడ్ సీరియస్‌గా చూస్తూ అమ్ము ఏంటి ఆ మాటలు.. అసలు దేని గురించి అంటున్నావు నువ్వు అంటూ అడుగుతాడు. అమ్ము పలకదు.. కానీ ఇంతలో అక్కడికి వచ్చిన మనోహరి మాత్రం కొంపదీసి భాగీ తల్లి అవ్వడం గురించి అయితే కాదు కదా..? అనగానే.. రాథోడ్, మిస్సమ్మ షాక్ అవుతారు. మిస్సమ్మ కోపంగా మనోహరి నాకు నా పిల్లల మధ్యలోకి నువ్వు రాకు.. అంటుంది. దీంతో అమ్ము కోపంగా ఎవరి మధ్యలోకి ఎవరు వస్తున్నారు మిస్సమ్మ.. మనోహరి ఆంటీ ఈ ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మా మధ్యలోకి వస్తుంది ఎవరు..? మా నాన్నకు మేం నలుగురం చాలు మరో బేబీ అవసరం లేదు.. అంటూ అమ్ము చెప్పగానే.. రాథోడ్, మిస్సమ్మ షాక్ అవుతారు. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.