Brahmamudi serial today Episode: మూర్తి చేత రాజ్‌కు భోజనం పంపిస్తుంది కావ్య. అది తాను పంపించినట్టు తెలియకుండా ఎవ్వరూ చూడకుండా నువ్వే తీసుకొచ్చినట్టు ఆయనకు చెబితేనే తింటాడని మూర్తికి చెప్తుంది. దీంతో మూర్తి సరే అంటూ భోజనం తీసుకుని వెళ్తాడు. మూర్తి వెళ్లే సరికే రాజ్ ఆకలితో బాధపడుతుంటాడు. అనవసరంగా చాలెంజ్ చేశానా అని ఆకలి మంటతో అనుకుంటుంటాడు. ఇంతలో మూర్తి అల్లుడు గారు మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసు అల్లుడు గారు.. ఏంటి అల్లుడు గారు అలా చూస్తున్నారు. నిరాహారదీక్షలో అన్నం ఎలా తినాలనా..? దీక్ష నాకూతురు కోసమే కదా..? తను లేనప్పుడు ఎలా తింటే ఏంటి..? ఎవ్వరూ చూడరు లేండి లాగించేయండి అంటూ మూర్తి చెప్పగానే..
భోజనం తీసుకుంటూ మామయ్య మీరు నిజంగా నా పాలిట దేవుడు లాంటి వాళ్లు అంటూ భోజనం చేస్తుంటాడు రాజ్. మూర్తి రాజ్‌నే చూస్తుంటాడు. దీంతో రాజ్ ఏంటి మామయ్య అలా చూస్తున్నారు..? అని అడగ్గానే.. ఏం లేదు బాబు.. నా కూతురును ఇంతలా ఇష్టపడే మీరు అంతలా ప్రేమిస్తున్న మీరు ఆ నిజం ఏంటో ఎందుకు చెప్పలేకపోతున్నారో అని చూస్తున్నాను అంటాడు మూర్తి.. దీంతో రాజ్ చెప్పలేనిది కాబట్టే చెప్పలేకపోతున్నాను మామయ్య దయచేసి ఆ ఒక్కటి మాత్రం అడక్కండి అంటాడు. కిటికీలోంచి చూస్తున్న కావ్య బాధపడుతుంది. పక్కకు వెళ్లి కూర్చుని ఏడుస్తుంది. ఇంతలో కనకం కుంకుమ పువ్వు వేసిన పాలు తీసుకుని వచ్చి కావ్య నీకోసం ఏం తెచ్చానో చూడు కుంకుమ పువ్వు వేసిన పాలు.. ఈ పాలు తాగితే బిడ్డ ఎర్రగా పుడతాడంట తాగు .. అంటూ కనకం చెప్పగానే.. కావ్య తాగలేనమ్మా..? నాకొద్దు తాగాలని లేదు అంటుంది.
ఏంటి తాగాలని లేదా..? ఏంటి పిచ్చిపిచ్చిగా ఉందా నీకు టైం కు ఫుడ్డు తీసుకోకపోతే కడుపులో బిడ్డకు ఇబ్బంది కాదా..? తాగు అంటుంది కనకం. నువ్వు నా కడుపులో బిడ్డ గురించి ఆలోచిస్తున్నావు అమ్మ.. కానీ నేన నా కళ్ల ముందు ఉన్న నా భర్త గురించి ఆలోచిస్తున్నాను.. అంటుంది కావ్య. ఇప్పుడు అంతలా ఆలోచించడానికి ఏమైంది బాగానే ఉన్నాడు కదా..? అంటుంది కనకం.. దీంతో ఏంటమ్మా బాగుండేది.. కోటలో రాజులా ఉండాల్సిన ఆయన ఇలా రాత్రి పడుకోవడానికి దోలు కొట్టుకుంటూ ఉంటే ఆయన్ని అలా చూసి ఉండటం నావల్ల కాదమ్మా అంటుంది.
దీంతో కనకం ఓసేయ్ భర్తను మార్చాలంటే ఇనుప ముద్దలా ఉండాలే.. ఇలా ఒక్క రాత్రికే ఐసు ముద్దలా కరిగిపోతే కన్నీళ్లు పెట్టుకుంటున్నావేంటి… ఇలా అయితే నువ్వు అల్లుడి గారిని మార్చినట్టే.. అంటుంది. దీంతో కావ్య ఇలా నా కళ్ల ముందే ఉంటూ అలా బయట కష్టపడుతుంటే.. భార్యగా నేను చూడలేకపోతున్నాను అమ్మ అంటూ కావ్య ఎమోనల్ అవుతుంది. దీంతో కనంక ఇప్పుడేంటి..? అల్లుడి గారిని ఇంట్లోకి తీసుకురావాలి అంతే కదా..? ఇక ఆ విషయం మర్చిపో అంతా నేను చూసుకుంటాను.. ఈ పాలు తాగు అంటూ పాలు ఇస్తుంది కనకం.. కావ్య పాలు తాగేస్తుంది.
బయటకు వచ్చిన కనకం రాజ్ మనసు మారేలోగానే కావ్య మనసు మార్చుకునేలా ఉందని అపర్ణకు కాల్ చేసి చెప్తుంది. అందుకే నేను వెంటనే రాజ్ మనసు మారేలా ఒక నాటకం ఆడాలనుకుంటున్నాను అందుకు మీ హెల్ఫ్ కావాలి అని అడుగుతుంది. దీంతో అపర్ణ సరే వాడి మనసు మారుతుందంటే ఏం చేయడానికైనా రెడీ అని చెప్తుంది. అయితే రేపు దీపావళి కదా మీరు ఇద్దరూ ఇక్కడికి వచ్చేయండి ఆ తర్వాత ఎలా చేయాలి..? ఏం చేయాలి అనేది చెప్తాను అనగానే.. అపర్ణ అలాగే కనకం రేపు పొద్దున్నే వచ్చేస్తాం. మనకు వాడి మనసు మారి దాని కడుపు పండితే మనకు అంతే చాలు అంటుంది అపర్ణ. సరే అంటూ కాల్ కట్ చేస్తుంది.
అంతా పైనుంచి వింటున్న రుద్రాణి..రాహుల్ రూంలోకి వెళ్తారు.. ఓరేయ్ రాహుల్ రేపు దీపావళికి వాళ్లతో పాటు మనం ఆ ఇంటికి వెళ్దాంరా అంటుంది. ఎలా వెళ్దాం మమ్మీ పిలవని పేరంటానికి అంటాడు రాహుల్. రేయ్ ఈడియట్ మనం అక్కడికి వెళ్దాం అంటుంది అక్కడ మనం పిండి వంటలు తినడానికి కాదు.. ఇదొక్కటే మనకు ఉన్న చివరి అవకాశం.. దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అక్కడికి వెళ్లితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అంటూ రుద్రాణి తన ప్లాన్ చెప్పగానే రాహుల్ సరే మమ్మీ అంటాడు.
తర్వాత రాజ్ పడుకుని ఉంటే కావ్య వెళ్లి తలగడ పెట్టి దుప్పటి కప్పుతుంది. మరుసటి రోజు ఉదయం అందరూ కలిసి కనకం ఇంటికి వస్తారు. అప్పటికీ రాజ్ నిద్రలోనే ఉంటాడు. జూనియర్ స్వరాజ్ వెళ్లి రాజ్ పక్కన పడుకుంటాడు. దీంతో రాజ్ అమ్మో ఎలుక అంటూ భయపడుతూ నిద్ర లేస్తాడు. అందరినీ చూసి షాక్ అవుతాడు. అందరూ కలిసి రాజ్ మనసు మార్చాలని మాట్లాడుతుంటారు. ఇంతలో రుద్రాణి కల్పించుకుని రాజ్‌ను రెచ్చగొడుతుంది. దీంతో ఇంద్రాదేవి అడ్డుపడి రుద్రాణిని తిడుతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.