Sonal Chauhan: న్యూఇయర్ వస్తుందంటే చాలు సినీ తారాగణం దుబాయ్‌కి వెళ్లడం చూస్తున్నాము.
కొత్త సంవత్సరం కావడంతో ప్రొగ్రాంలు ఎక్కువగా దుబాయ్‌లో జరుగుతాయి.
ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ నుంచి తారలు అక్కడికి చేరుకుంటున్నారు.
వారిలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఒకరు. ఆగ్రాకు చెందిన ఈ బ్యూటీ గ్లామర్ ఇండస్ట్రీకి దశాబ్దంపైగానే గడిచింది.
బాలకృష్ణ నటించిన లెజెండ్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
ఆ తర్వాత డిక్టేటర్, రూలర్, ఎఫ్ 3 సినిమాలతో మరింత అభిమానులను పోగేసుకుంది.
దుబాయ్‌లోని వెర్డే బీచ్ దుబాయ్ సమీపంలోని ఓ హోటల్‌లో రిలాక్స్ అవుతోంది.
అందుకు సంబంధించి ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఆయా ఫోటోలపై ఓ లుక్కేద్దాం.