E-Paper
Advertisement

Telugu TV Serials: టీవీ సీరియల్స్ రేటింగ్..కార్తీక దీపం తో ఆ సీరియల్ పోటీ..?

Telugu TV Serials: టీవీ సీరియల్స్ రేటింగ్..కార్తీక దీపం తో ఆ సీరియల్ పోటీ..?
Advertisement

Telugu TV Serials TRP Ratings : వినోదాన్ని పంచడంలో సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఈ మధ్య సినిమాలను మించిన స్టోరీలతో బుల్లితెర సీరియల్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఒక్కో సీరియల్ ఒక్కో స్టోరీ తో ఆడియన్స్ కి ఆసక్తిని కలిగిస్తూ మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నీ కూడా తెలుగు ప్రేక్షకులకు మనసు దోచుకున్నాయి. ఒక్కో సీరియలు ఒక్కో స్టోరీ తో నువ్వా నేనా అంటూ పోటీపడి మరి టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే పాత సీరియల్స్ కన్నా కొత్తగా వచ్చిన సీరియల్స్ ముందుకు వెళ్లడం విశేషం.. మరి ఈ వారం ఏ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుందో ఒకసారి తెలుసుకుందాం..

కార్తీక దీపం 2.. 

నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాధ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్లాక్ బస్టర్ సీరియల్ కార్తీకదీపం. ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్స్ లో మొదటిగా గుర్తొచ్చే పేరు ఇదే. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా కార్తీకదీపం 2 ప్రసారమవుతుంది.  ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ విషయానికొస్తే.. ప్రస్తుతం ఇదే టాప్ పొజిషన్ లో ఉంది. 13.48 రేటింగ్ తో దూసుపోతుంది.

ఇల్లు ఇల్లాలు పిల్లలు.. 

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు.. కుటుంబంలోని మనుషుల మధ్య ప్రేమానురాగాలు, ద్వేషాలు ఎలా ఉంటాయో అనేది ఈ సీరియల్ లో చూపించారు. రీసెంట్ గా ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. కార్తీకదీపం 2 తర్వాత ఈ సీరియల్ రెండో స్థానంలో కొనసాగుతుంది.. దీని రేటింగ్ విషయానికొస్తే.. తాజాగా 12.56 రేటింగ్ నమోదైంది.

గుండెనిండా గుడిగంటలు.. 

మరో సక్సెస్ఫుల్ సీరియల్ గుండెనిండా గుడిగంటలు. బాలు మీనాలా ప్రేమ కథ.. డబ్బుల కోసం ప్రభావతి చేస్తున్న ప్రయోగాలు. మధ్యతరగతి కుటుంబానికి కోటీశ్వరులు కావాలని కొందరి ఆలోచనలు కుటుంబంలో తెచ్చే చికాకులను కళ్ళకు కట్టినట్టు చూపించారు.. ఇప్పుడు కాస్త ఈ సీరియల్ మరోసారి ఇంట్రెస్టింగ్గా మారింది. దాంతో రేటింగ్ కూడా బాగానే పెరుగుతూ వస్తుంది. రేటింగ్ విషయానికి వస్తే.. 12.28 ఉందని తెలుస్తుంది.

ఇంటింటి రామాయణం.. 

Advertisement

స్టార్ మా ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా చూస్తున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం కూడా ఒకటి.. టైటిల్ కి తగ్గట్లే సీరియల్ లోని పాత్రలు కూడా ఉంటాయి. ఈ సీరియల్ రేటింగ్ లో నాల్గో స్థానంలో కొనసాగుతుంది.. ఆ సీరియల్ కు 11.56 రేటింగ్ వచ్చింది.. అందరు కలిసి పోవడంతో రేటింగ్ కూడా బాగా పెరిగింది..

Also Read : నర్మద పై కలెక్టర్ ప్రశంసలు.. రామరాజు గౌరవాన్ని కాపాడిన కోడళ్లు.. ధీరజ్ ప్రేమకు ప్రపోజ్..

కొత్త సీరియల్ ఎక్కువగా టాప్ రేటింగ్ తో దూసుకుపోవడం మామూలు విషయం కాదు.. గత ఏడాదిగా టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న స్టార్ మా సీరియల్ గుండెనిండా గుడిగంటలు సీరియల్ కాస్త పస తగ్గడంతో రేటింగ్ పడిపోయిందని టాక్ వినిపిస్తుంది. నిన్ను మనసులో సీరియల్నినిన్ను మనసులు సీరియల్ ఈమధ్య ప్రసారమవుతుంది. మిగిలిన సీరియల్స్ విషయానికొస్తే.. తాజా రేటింగ్స్ లో నిన్ను కోరి 8.23తో ఏడో స్థానానికిరావడం విశేషం. 6.17 రేటింగ్ తో నువ్వుంటే నా జతగా సీరియల్ 8వ స్థానంలో.. 6.15తో పలుకే బంగారమాయెనా 9వ స్థానంలో నిలిచింది. ఇకపోతే ఇవే కాదు ఇంకా కొన్ని సీరియల్స్ ఇప్పుడిప్పుడే టిఆర్పి రేటింగ్ ని పెంచుకుంటున్నాయి. కేవలం స్టార్ మా చానల్స్ లో మాత్రమే కాదు అటు జీ తెలుగులో కూడా కొన్ని సీరియల్స్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×