Satyabhama Today Episode December 30 th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఎమ్మెల్యే అవుతానని సత్య క్రిష్ కు చెప్పేస్తుంది. దానికి షాక్ అయిన క్రిష్ నాకు ఇష్టం లేదు సత్య అంటాడు కానీ సత్య మాత్రం వెనక్కి తగ్గేదేలేదు అని మొండిగా కూర్చుంటుంది నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. ఇక ఏమి మాట్లాడకుండా కిందకు వచ్చేస్తాడు. మహదేవయ్య లాయర్ తో ఎమ్మెల్యే ఫామ్ ను ఫిల్ అప్ చేయిస్తుంటాడు. అప్పుడే సత్య కిందకి వస్తుంది. సత్య నువ్వు సైన్ చెయ్ అమ్మ నీ చేయి చాలా మంచిది నీకు పట్టుచీర కొని పెడతానని అంటాడు. దానికి క్రిష్ సత్య సైన్ చేయదు బాపు అనేసి అరుస్తాడు. ఏందిరా నువ్వు చెప్పేది ఏం మాట్లాడుతున్నావ్ రా అనేసి బైరవి అడుగుతుంది. నేను చెప్పేది నిజమే బాపుకి వ్యతిరేకంగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిలబడుతుందట అనేసి బైరవితో అరుస్తాడు క్రిష్.. ఇదంతా చూస్తూ మహదేవయ్య సంతోషపడతాడు. ఈ కుండలు బద్దలు కొట్టడమే నాకు కావాలి అనుకుంటాడు. ఇదంతా చూసి సంతోష్ పడుతున్నావా మావయ్య తెగించేసాను అని సత్య మనసులో అనుకుంటుంది. ఒక అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోలేను ఆ అన్యాయాన్ని ఎలాగైనా ఎదిరించాలని అనుకుంటాను కానీ నాకు అధికారం కావాలి అధికారం ఉంటేనే అన్యాయాన్ని ఎదిరించవచ్చని నాకు అర్థమైంది ఈ విషయంలో నా మనసు మార్చుకునేదే లేదు అనే శ్రీ సత్య వెళ్ళిపోతుంది. ఇక భైరవి మాత్రం చూసావా రా నీ పెళ్ళాం ఎలా మాట్లాడుతుందో కనీసం అత్త మామ అంటే భయం లేదు మొగుడి మాట కూడా వినలేదు మొండిగా మాట్లాడుతుంది. విశ్వనాథం కు చెప్పి కూతురుకు నచ్చచెప్పమని చెప్తుంది. సత్యతో నిజాలు తెలుసుకొనే ప్రయత్నం చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇక సత్య దగ్గరికి విశ్వనాథం వెళ్లి ఏమైంది అంతగా బాధపడుతున్న వెంటమ్మ నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు కానీ నాకు చెప్పుకోలేని బాధలు ఉన్నా చెప్పు అనేసి విశ్వనాథం అడుగుతాడు.. సత్య బాధపడుతూ తన బాధని చెప్తుంది. తండ్రిని చూడగానే కన్నీళ్లు పెట్టుకుంటుంది సత్య. నేను చేస్తుంది తప్పో ఒప్పో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చావా నాన్న అంటే..నువ్వు నీ కుటుంబానికి ఎదురు వెళ్లకూడదమ్మా అంటాడు. నిన్ను ఎలా రక్షించుకోవాలో అర్థంకాక టెన్షన్ పడుతున్నా అంటాడు.. నాకు పవర్ కావాలి నాన్నా నా జీవితాన్ని కొందరు తొక్కిపెట్టేస్తున్నారు అంటుంది. ఎదురులేదని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటుంది. మనం అనుకున్నవన్నీ జరిగిపోవమ్మా అని సర్దిచెబుతాడు. కానీ సత్య నిర్ణయం వెనక్కు తీసుకోదు.. ఇక అదే మాట భైరవికి చెప్తాడు. ఇక జయమ్మ కూడా సత్య దగ్గరకు వస్తుంది. నువ్వు చెప్పేది చేసేది తప్పు కాదు.. అసలు నువ్వు ఎందుకు చేస్తున్నావో నువ్వు ఆలోచించు అని జయమ్మ అని సత్యకు చెబుతుంది.
ఇక రాత్రి అవ్వగానే సత్య అందరికి వడ్డీంచడానికి వస్తుంది. కానీ భైరవి మాత్రం అస్సలు ఒప్పుకోదు. తిడుతుంది. నీ మామ మాటంటే లెక్క లేదా అనేసి అరుస్తుంది ఇక చిన్నాన్న నీ పెళ్ళాం అంతగా రెచ్చిపోతుంది కనీసం నువ్వు చెప్పడానికి కూడా ట్రై చేయట్లేదు అని చేతగాని వాడివా అంటూ సత్యముందే కృష్ణుని తిడుతుంది కానీ క్రిష్ మాత్రం నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఇక తన ఇష్టం అని వెళ్ళిపోతాడు. ఇక భైరవి మాత్రం సత్య పై ఒంటి కాలు మీద లేస్తుంది. మన ఇంట్లో తింటూ మనింటికి ఎసరు పెట్టాలని చూస్తుంది పెనిమిటి అది నీకు అర్థం కావట్లేదా అనేసి తిడుతుంది. అది చేసింది మీరే తినండి అనేసి బైరవి వెళ్లిపోతుంది. ఇక మహదేవయ్య కూడా వెళ్ళిపోతాడు. జయమ్మ రేణుకతో అంటుంది. ఇంట్లో ఇంకెన్ని గొడవలు అవుతాయో భయంగా ఉంది అనేసి అనగానే రేణుక మీరు ఒకసారి సత్యకు చెప్పొచ్చు కదా అమ్మమ్మ అని అంటుంది. వాళ్ళ నాన్న చెప్తేనే తినలేదు నేను చెప్తే వింటుందా అనేసి చేయమంటుంది..
ఇక సంధ్య సంజయ్ తో సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతుంది. విశాలాక్షి ఇంత టైం అయినా సంధ్య ఇంకా పడుకోలేదు ఏంటి ఇంకా లైట్ వెలుగుతుంది ఏంటి అటు లోపలికి వస్తుంది. సంధ్య ఫోన్ మాట్లాడుతూ అడ్డంగా బుక్ అవుతుంది. ఈ ఖరీదైన ఫోన్ నీకు ఎవరు ఇచ్చారు అంటే అబద్ధం చెప్తుంది. ఇలాంటి గిఫ్ట్లు తీసుకోవడం మంచిది కాదని విశాలాక్షి ఆ గిఫ్ట్ తనకి ఇచ్చేసేయ్ అని చెప్పేసి చెప్తుంది. తెలియకపోవడంతో సంధ్య ఊపిరి పీల్చుకుంటుంది. ఇక భైరవి మాత్రం రూమ్ లోకివెళ్లి కోపంగా అన్ని విసర్ కొడుతుంది. నీ మాటంటే లెక్క లేదా పెనిమిటి నువ్వు ఒకసారి గట్టిగా చెప్తే తనపై కోప్పడితే నీ మాట వింటుంది కదా అనేసి అనగానే మహదేవయ్యా క్రిష్ రావడం చూసి మాట మారుస్తాడు సత్యని భయపెట్టి నా దారి తెచ్చుకోవడం క్షణం పని కానీ చిన్న గాడు బాధపడతాడని ఆలోచిస్తున్నాను. చిన్నా కోసమే నేను మౌనంగా ఉంటున్నాను అనేసి అంటాడు అది విన్న చిన్న ఇంత మంచి మనిషిని బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం అనుకుంటూ అనుకొని వెళ్ళిపోతాడు. ఇక క్రిష్ మాట్లాడడానికి సత్య ప్రయత్నిస్తుంది. క్రిష్ మాత్రం మౌనంగా ఉంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. ఏపీ ఎపిసోడ్లో సత్య మీడియా ముందు అనౌన్స్ చేస్తుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్న విషయాన్ని మీడియాతో చెప్తుంది ఇక ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..