Senior heroines:ఏ ఇండస్ట్రీలో అయినా సరే హీరోయిన్లు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వరుసగా అవకాశాలు అందుకొంటున్న సమయంలోనే అనూహ్యంగా పెళ్లి చేసుకోవడం లేదా ఇతర వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరమవుతారు. మళ్ళీ కొన్నేళ్ల విరామం తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అలా ప్రయత్నంలో భాగంగా కొంతమంది మునుపటిలాగే ఊహించని సక్సెస్ అందుకుంటే.. మరికొంతమంది రీ ఎంట్రీలో ఊహించని డిజాస్టర్ లను మూటగట్టుకొంటూ ఉంటారు.
అయితే ఈ మధ్యకాలంలోనే రీ ఎంట్రీ ఇచ్చిన చాలా మంది సీనియర్ హీరోయిన్స్ కి ఏ మాత్రం కలిసి రాలేదని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరో హీరోయిన్ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. మరి ఆమె ఎవరు? ఆమె కెరియర్ కి రీ ఎంట్రీ ఏ విధంగా ఉపయోగపడుతుంది ? అసలు ఇప్పటివరకు రీఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలని ప్రయత్నించిన సీనియర్ హీరోయిన్స్ లో జెనీలియా, లయ, అన్షు అంబానీలకు నిరాశ ఎదురయింది. ఉదాహరకు.. లయ.. ఒకప్పుడు పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసే భారీ పాపులారిటీ సంపాదించుకున్న లయ.. కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని విదేశాలలో సెటిల్ అయిపోయింది. కరోనా సమయంలో ఉద్యోగం కూడా చేసిన ఈమె.. ఇప్పుడు మళ్లీ నితిన్ (Nithin)హీరోగా నటించిన ‘తమ్ముడు’ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నితిన్ కి అక్క పాత్ర పోషించి ,తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. దీంతో రీ ఎంట్రీ లయకు కలిసి రాలేదు.
మన్మధుడు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర, మిస్సమ్మ వంటి సినిమాలలో కూడా నటించింది. తర్వాత ఇండస్ట్రీకి దూరమైన అన్షు అంబానీ.. ఈమధ్య సందీప్ కిషన్ , రావు రమేష్ కాంబినేషన్లో వచ్చిన మజాకా సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో తన అందంతో, నటనతో విపరీతంగా ఆకట్టుకుంది కానీ ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.
ALSO READ:Bigg Boss 9: నాన్న ఆఖరి చూపుకు కూడా నోచుకోలేకపోయా..రమ్య ఎమోషనల్!
బొమ్మరిల్లు సినిమాతో ఊహించని క్రేజ్ సొంతం చేసుకున్న జెనీలియా ఈ మధ్య రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలా హిందీలో మిస్టర్ మామ్, వేద్, ట్రయల్ పీరియడ్, సితారే జమీన్ పర్ తో పాటూ తెలుగులో జూనియర్ అంటూ పలు చిత్రాలు చేసింది. కానీ ఈ సినిమాలు ఏవి కూడా భారీ సక్సెస్ ను అందించలేదు. అలా వీరందరికీ సెకండ్ ఇన్నింగ్స్ లో సక్సెస్ లభించలేదు అని చెప్పడంలో సందేహం లేదు.
ఇలాంటి సమయంలో ఇప్పుడు మరొక హీరోయిన్ కామ్నా జెఠ్మలానీ (Kamna Jethmalani ) పదేళ్ల విరామం తర్వాత టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తోంది. 2005లో ప్రేమికులు చిత్రంతో ఎంట్రీ ఇచ్చి.. రణం సినిమాతో ఫేమస్ తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత బెండు అప్పారావు, కత్తి కాంతారావు వంటి సినిమాలు చేసింది. 2014లో పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైన ఈమె.. ఇప్పుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న కే రాంప్ చిత్రంలో కీలకపాత్ర పోషిస్తుంది. అక్టోబర్ 18న విడుదల కాబోతున్న ఈ సినిమా కనీసం ఈమెకైనా సక్సెస్ అందిస్తుందేమో చూడాలి.