SAW vs BanW: వన్డే మహిళల ప్రపంచ కప్ 2025 చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 13 మ్యాచ్ లు పూర్తయ్యాయి. ఇవాళ 14 మ్యాచ్ నిర్వహించనున్నారు. సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఈ రెండు జట్ల మధ్య ఏ జట్టు గెలిచినా కూడా టీమిండియా కు పెను ప్రమాదమే. పాయింట్లు పట్టికలో టీమిండియాను వెనక్కి నెట్టే ఛాన్స్ ఈ రెండు జట్లకు వచ్చింది.
విశాఖపట్నంలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య ఇవాళ 14 వ మ్యాచ్ జరగనుంది. ఎప్పుడు ఇలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండున్నర గంటల ప్రాంతంలో టాస్ ప్రక్రియ ఉంటుంది. ఇందులో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విశాఖపట్నం స్టేడియంలో సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు కచ్చితంగా విజయం సాధించడం ఖాయమని అంటున్నారు. నిన్న టీమిండియా పై 331 పరుగుల లక్ష్యాన్ని కూడా ఆస్ట్రేలియా అవలీలగా ఛేదించింది. అందుకే టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు.
అయితే ఈ రెండు జట్లలో సౌత్ ఆఫ్రికా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే టీమిండి అని ఓడించిన ఊపులో సౌత్ ఆఫ్రికా ఉంది. ఇవాల్టి మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కనుక విజయం సాధిస్తే, ఆరు పాయింట్లు సాధించి మూడో స్థానానికి వెళ్లడం ఖాయం. ఒకవేళ ఓడిన రన్ రేట్ మెరుగుపరుచుకుంటే టీమిండియాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి వెళ్ళవచ్చు. అటు బంగ్లాదేశ్ ఇవాల్టి మ్యాచ్లో ఎక్కువ రన్ రేట్ తో మ్యాచ్ గెలిస్తే టీమిండియా స్థానానికి వెళ్లిపోవచ్చు. లేకపోతే నాలుగో స్థానానికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ్టి మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధించిన టీమిండియా కు పెను ప్రమాదమే.
బంగ్లాదేశ్ జట్టు అంచనా: 1 రుబ్యా హైదర్, 2 షర్మిన్ అక్తర్, 3 నిగర్ సుల్తానా (కెప్టెన్ & wk), 4 శోభనా మోస్తరీ, 5 సుమైయా అక్టర్, 6 షోర్నా అక్టర్, 7 ఫహిమా ఖాతున్, 8 నహిదా అక్టర్, 9 రబేయా ఖాన్, 10 మారుఫా నిషిత, అక్టర్ 11 నిషిత
దక్షిణాఫ్రికా జట్టు అంచనా: 1 లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), 2 తజ్మిన్ బ్రిట్స్, 3 సునే లూస్, 4 మారిజానే కాప్, 5 అన్నెకే బాష్/అన్నెరీ డెర్క్‌సెన్, 6 సినాలో జాఫ్తా (వాక్), 7 క్లో ట్రయాన్, 8 నాడిన్ డి క్లెర్క్, 9 తుమి, 10 టుమీ, 10 టుమీ నోంకులులేకో మ్లాబా
Australia move to the top spot in the points table following a dominant win against India. 🇦🇺🔝#INDvAUS #CWC25 #ODIs #Sportskeeda pic.twitter.com/ABMcJZE30P
— Sportskeeda (@Sportskeeda) October 12, 2025