CSK Srinivasan: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు ధోని. ఆ తర్వాత ఎన్. శ్రీనివాసన్ పేరు మాత్రమే అందరికీ వినిపిస్తుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును తెరపైకి తీసుకువచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు ఎన్. శ్రీనివాసన్. ఆయన వ్యూహాత్మక ఎత్తుగడల కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మంచి స్థాయిలో ఉంది. అయితే అలాంటి చెన్నైకి చెందిన శ్రీనివాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మహిళల జట్టు కారణంగా రూపాయి లాభం లేదని ఫైర్ అయ్యారు. ఐసీసీ రూల్స్ చెబుతున్నాయి కాబట్టి మహిళల జట్టును ఇండియాలో కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో శ్రీనివాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో టీమిండియా మహిళల జట్టు అత్యంత దారుణంగా విఫలమవుతోంది. మొదట శ్రీలంక అలాగే పాకిస్తాన్ జట్లపై వరుసగా విజయాలను నమోదు చేసుకున్న టీమిండియా, పెద్ద జట్లతో మ్యాచ్ లు నిర్వహించేసరికి తోక ముడుస్తోంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో ఉన్న టీమిండియా మహిళల జట్టు… ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. మరో మ్యాచ్ ఓడిపోతే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో గతంలో శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు జనాలు.
బీసీసీఐ ప్రెసిడెంట్ గా గతంలో శ్రీనివాసన్ పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ అనుభవంతో గత సంవత్సరం శ్రీనివాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా మహిళల జట్టు కారణంగా బీసీసీఐకి నష్టం తప్ప రూపాయి లాభం లేదని బాబు పేల్చారు. ఐసీసీ అమలు చేస్తున్న కఠినమైన రూల్స్ కారణంగా బలవంతంగానే టీమిండియా మహిళల జట్టును కొనసాగిస్తున్నామన్నారు. లేకపోతే ఎప్పుడో తొలగించేవాళ్లమని చెప్పుకొచ్చారు శ్రీనివాసన్. వాళ్లు ఇంట్లో రొట్టెలు చేసుకుంటే బెస్ట్ అని చురకలు అంటించారు. టీమిండియా మహిళల జట్టు వరల్డ్ కప్ లో విఫలమౌవుతున్న తరుణంలో శ్రీనివాసన్ చేసిన వాఖ్యలు గుర్తు చేస్తున్నారు.
After today's performance of indian team my respect for this man increases 😜#INDWvsAUSW pic.twitter.com/RWLvkpueCv
— 100rav (@100rav63) October 12, 2025