Heavy Rains : తెలుగు రాష్ట్రాలకు వానగండం పొంచి ఉందా? దీపావళికి ముసురు రానుందా? వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడనుంది. రానున్న రెండుమూడు రోజులు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
దీపావళికి ముసురు తప్పదా?
మే నెల చివర దక్షిణ భారతాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయి. సెప్టెంబర్ 20 నాటికి ఉత్తర భారతదేశానికి చేరుకున్నాయి. గతనెల 24 నుంచి తిరుగుముఖం పట్టాయి. ఈ క్రమంలో తెలంగాణ, ఏపీల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది.
అక్టోబరు 15 నుంచి తెలంగాణలో నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో సాయంత్రం వరకు పొడి వాతావరణం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల వాన కబురు
రానున్న రెండుగంటలు యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, జనగాం, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెంలో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి. హైదరాబాద్ సిటీలో రానున్న గంట పాటు జల్లులు, చినుకులు పడే అవకాశం ఉంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అత్యవసరం తప్పితే ప్రజలు బయటకు రావొద్దని సూచించింది. వర్షం సమయంలో చెట్ల కింద, హోర్డింగుల వద్ద ఉండొద్దని పేర్కొంది. భారత వాతావరణ శాఖ-IMD అక్టోబర్ 15 నుంచి 16 మధ్య హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ భారతంలో రాబోయే కొద్దిరోజుల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్ .. కీలకంగా మారిన ఆ ఓటర్లు
అక్టోబర్ 12 నుండి 18 వరకు తమిళనాడు, కేరళలోని కొన్నిప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్టోబర్ 13 నుంచి 14 మధ్య దక్షిణ కర్ణాటక, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది.
హైదరాబాద్ వాతావరణ సూచన
అక్టోబర్ 13న ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. రోజంతా స్వల్పంగా పొగమంచు ఉంటుంది. ఉష్ణోగ్రతలు 31°C వద్ద ఉన్నట్లు అంచనా వేసింది.
అక్టోబర్ 14న హైదరాబాద్ సిటీలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై తేలికపాటి వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 31°Cకి దగ్గరగా ఉండటంతో తేమస్థాయి కొద్దిగా పెరుగుతుందని అంచనా.
అక్టోబర్ 15న ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.
అక్టోబర్ 16న ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షం లేదా చినుకులు పడవచ్చు. ఉష్ణోగ్రతలు 30°C ఉండవచ్చని భావిస్తోంది. ఆ తర్వాత వాతావరణం తేమగా ఉంటుందని తెలిపింది. 17, 18 తేదీల్లో ఇదే పరిస్థితి నెలకొంటుందని అంచనా వేసింది. ఎటుచూసినా దీపావళికి ముందు భారీ వర్షాలు తప్పవని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ.
Today's FORECAST ⚠️⛈️
ONGOING MODERATE RAINS and THUNDERSTORMS to continue in Yadadri – Bhongir, Nalgonda, Suryapet, Jangaon, Mahabubabad, Mulugu, Bhadradri – Kothagudem for next 2hrs, later reduce completely
Mainly dry weather expected in Telangana thereafter till evening.…
— Telangana Weatherman (@balaji25_t) October 13, 2025