Netflix Top Movies: ప్రతివారం కొత్త సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి.. అయితే ఈ మధ్య పాత సినిమాలు కూడా రియల్ అవుతూ మళ్లీ మంచి టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. థియేటర్లలో మాత్రమే కాదు అటు డిజిటల్ ప్లాట్ ఫామ్ ల లోకి కూడా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తూ ఉంటాయి.. ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అవ్వకముందే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను ముందే లాక్ చేసుకుంటున్నాయి. ఎన్నో ఓటీటీ సంస్థలు మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు పోటీపడి మరి కొత్త సినిమాలను రిలీజ్ చేస్తున్నాయి. ఎక్కువగా కొత్త సినిమాలు వస్తున్నా ఫ్లాట్ ఫామ్లలో ఒకటి నెట్ ఫ్లిక్స్.. ఈ మధ్య ఇందులో రిలీజ్ అయిన సినిమాలు టాప్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. అందులో ఓ ఐదు సినిమాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ స్టార్ హీరో గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం వార్ 2.. బాలీవుడ్ లో ఎన్టీఆర్ చేసిన మొదటి చిత్రం కావడంతో ఈ సినిమా పై భార్య అంచనాలు మొదటి నుంచి క్రియేట్ అవుతూ వస్తున్నాయి. ఆగస్టు 14న థియేటర్ల లోకి వచ్చిన ఈ మూవీ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. కానీ కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది.. ఈనెల తొమ్మిదో తారీఖున ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ మంచి వ్యూస్ ని రాబడుతుంది. తెలుగులో కన్నా హిందీలో ఈ సినిమా దుమ్ము దులిపేస్తుంది. టాప్ టెన్ లో ఇదే మొదటిగా ఉండడం విశేషం.
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కాంతారా.. మూడేళ్ల క్రితం థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీలో మంచి టాక్ ని సొంతం చేసుకుంటుంది.. ఈ మూవీ వచ్చి మూడేళ్లయినా సరే ఇక్కడ క్రేజ్ మాత్రం తగ్గలేదు. రీసెంట్ గా ఈ చిత్రానికి సీక్వెల్ గా మరో సినిమా వచ్చింది. ఆ మూవీ కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. నా కూడా కాంతార హిందీ వర్షన్ లో వ్యూస్ ని రాబడుతుంది. ప్రస్తుతం ఇది సెకండ్ ప్లేస్ లో ఉంది.
ఇటీవల థియేటర్లోకి వచ్చిన యానిమేషన్ చిత్రం మహావతార్ నరసింహ.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమాకి జనాలు నీరాజనం పలికారు. మొదటి షో నుంచి థియేటర్లలో నుంచి వెళ్లే వరకు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఇటీవలే ఓటీటీలోకి అడుగు పెట్టిన ఈ మూవీ ఇక్కడ భారీ వ్యూస్ ని రాబడుతుంది.
థియేటర్లలోకి రిలీజ్ అవ్వకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో పాజిటివ్ టాక్ ను అందుకుంది. సైమన్ స్టోన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిరా నైట్‌లీ, గై పీర్స్, డేవిడ్ అజాలా కీలక పాత్రలు పోషించారు. మిస్టరీ థ్రిల్లర్ స్టోరీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
Also Read : బాలీవుడ్ లోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ ..హీరో ఆయనే..?
వీటితో పాటుగా సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ కూడా ఉంది. ఇది టాప్ ఫైవ్ లో కొనసాగుతుంది. ఇక ఈనెల బోలెడు కొత్త సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి వాటిలో ఏ సినిమా అయినా టాప్ వ్యూస్ ని అందుకుంటుందేమో చూడాలి..