Sankranthiki vastunnam Remake: టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన చిత్రాలు బాలీవుడ్ లో లేదా ఇతర భాషలో రీమేక్ అవడం కామన్. గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలు ఇతర భాషల్లో కూడా రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన మరో సినిమా బాలీవుడ్ లో రీమేక్ ఈ రంగం సిద్ధమవుతుంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్ లోకి వచ్చిన బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం ఇప్పుడు బాలీవుడ్ లోకి రాబోతుంది. మీరు విన్నది అక్షరాల నిజం. ఈ సినిమాను బాలీవుడ్ మేకర్స్ రీమేక్ చేయబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత రాలేదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాని రీమేక్ చేయబోతున్న హీరో ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం బాలీవుడ్ లోకి రాబోతుంది. ఈ సినిమాను రీమేక్ చేయబోతున్నారు బాలీవుడ్ నిర్మాతలు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. చిన్న సినిమాగా వచ్చినా కూడా 300 కోట్లకు పైగా వసూలు చేసి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. అయితే ఈ సినిమాని ఇప్పుడు బాలీవుడ్లోకి తీసుకురాబోతున్నారు. బాలీవుడ్ కిలాడి అక్షయ్ కుమార్ ఈ మూవీని రీమేక్ చేయబోతున్నారంటూ ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇది అయితే నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అతి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని సమాచారం.
Also Read : టీవీ సీరియల్స్ రేటింగ్..కార్తీక దీపం తో ఆ సీరియల్ పోటీ..?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. గతంలో లాగా ఈయనకు ఈ మధ్య హిట్ సినిమాలు పలకరించలేదు. ఒకప్పుడు ఆయన ఏ సినిమా చేసిన కూడా బాక్స్ ఆఫీస్ ని షేర్ చేయడంతో పాటుగా కలెక్షన్ వర్షం కురిపించేవి. కానీ ఈ మధ్య ఈ హీరోకి పెద్దగా కలిసి రావడం లేదు. ఎలాంటి సినిమా తీసిన కూడా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి తప్ప కలెక్షన్లు కూడా పెద్దగా వచ్చినట్లు కనిపించలేదు. ఈయన చేసిన రీమిక్స్ సినిమాలు అన్నీ కూడా డిజాస్టర్ అయ్యాయి. తమిళ సూపర్ హిట్ మూవీ కాంచన, ఆకాశం ని హద్దురా, మలయాళ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ సినిమాలు బాలీవుడ్ లో భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అక్షయ్ కు రీమేక్ సినిమాలు కలిసి రావడం లేదు. అయినా కూడా మరో రీమిక్స్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. ఒరిజినల్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన దిల్ రాజు ఈ రీమేక్ కు కూడా నిర్మాతగా వ్యవహరించబోహున్నారు.. ఈ సినిమా అన్న అక్షయ్ కు మంచి టాక్ ని అందిస్తుందేమో చూడాలి..