Kadapa Crime News: పచ్చని కాపురంలో చిన్న చిన్న సమస్యలు తారాస్థాయికి చేరాయి. భార్యాభర్తలు కూర్చొని చర్చించుకోవాల్సిపోయి చివరకు తీవ్రరూపం దాల్చాయి. రోజురోజుకూ దంపతుల మధ్య అగాధం పెరిగింది. చివరకు ఆ కుటుంబంలో నలుగురు మృతి చెందారు. సంచలనం రేపిన ఈ ఘటన కడప జిల్లాలో వెలుగు చూసింది. అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది?
కడప జిల్లాలో దారుణం
కడప పట్టణం శంకరాపురానికి చెందిన శ్రీరాములు-శిరీష దంపతులు. వీరికి పెళ్లయిన చాన్నాళ్లకు కొడుకు పుట్టాడు. ఆ బాబు వయస్సు కేవలం ఏడాది మాత్రమే. నానమ్మ సుబ్బమ్మతో కలిసి శ్రీరాములు-శిరీష దంపతులు జీవిస్తున్నారు. కాకపోతే కొంతకాలంగా శ్రీరాములు-శిరీష మధ్య గొడవలు మొదలయ్యాయి. సుబ్బమ్మ ఆ దంపతులను మందలిస్తూ ఉండేది.
ప్రతీసారి ఇలాంటి గొడవలు చోటు చేసుకోవడంతో శ్రీరాములు-శిరీషలు తీవ్రమన స్థాపానికి గురయ్యారు. ఉన్నట్లుండి ఇంటి నుంచి మనవడు-మనవరాలు-మునిమనవడు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది సుబ్బమ్మ. ఆ కారణంగా గుండెపోటుకు గురై ఇంట్లోనే ప్రాణాలు విడిచింది. చివరకు ఆదివారం శ్రీరాములు-భార్య శిరీష, కొడుకు రుత్విక్‌ను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.
రైలు కింద పడిన దంపతులు
ఆదివారం రాత్రి కడప రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో గూడ్స్ రైలు కిందపడి ముగ్గురు ఆత్మహత్య పాల్పడ్డారు. రైలు ఢీకొట్టడంతో ముగ్గురి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. మృతుల్లో భర్త, భార్యతోపాటు ఏడాది చిన్నారి ఉన్నట్లు గుర్తించారు.
ALSO READ: బీచ్‌లో విషాదం.. స్నానం చేస్తూ ఐదుగురు మాయం
ఆ ముగ్గురు మృతదేహాలను కడప రిమ్స్‌కు తరలించారు. నాన్నమ్మతో కలిసి ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో శంకరాపురం ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఏంటి? ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితులు ఎందుకు తలెత్తాయి? బంధువుల ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. దంపతుల మధ్య విభేదాలకు కారణమేంటి అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. మృతుడు శ్రీరాములు మెడికల్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు.
విషాదంలో మరో ఘోరం
శ్రీరాములు కుటుంబం అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల గుర్తింపు
మృతుడు శ్రీరాములు మెడికల్ ఏజెన్సీలో పని చేస్తున్నట్లు సమాచారం
శ్రీరాములు కుటుంబం మరణ వార్త విని నానమ్మ గుండెపోటుతో మృతి
ఒకేరోజు నలుగురు మృతి చెందడంతో శోకసంద్రంలో కుటుంబ సభ్యులు https://t.co/KY51gGcp4V pic.twitter.com/eIbepE3yuU
— BIG TV Breaking News (@bigtvtelugu) October 13, 2025