Hyderabad News: హైదరాబాద్‌లో దారుణం జరిగింది. జువైనల్ హోమ్‌లో పర్యవేక్షకుడి దారుణాలు తారాస్థాయికి చేరాయి. చిన్నారుల కాపాడాల్సి పర్యవేక్షకుడు, కామాంధుడిగా మారాడు. ఈ ఘటనలో బాలురు పేరెంట్స్ ఫిర్యాదు మేరకు స్టాఫ్ గార్డ్‌ని అరెస్ట్ చేశారు పోలీసులు. అసలు ఏం జరిగింది?
హైదరాబాద్‌లో దారుణం
హైదరాబాద్ సిటీలోని సైదాబాద్ బాలసదన్‌లో దారుణం చోటు చేసుకుంది. బాలుర వసతి గృహంలో ఆరుగురిపై స్టాఫ్‌గార్డు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితుల్లో ఓ బాలుడి తల్లి పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంటనే గార్డుని అరెస్టు చేశారు పోలీసులు. ఇటీవల దసరా ఫెస్టివల్‌కు జువైనల్స్ హోమ్ నుంచి ఓ బాలుడు ఇంటికి వచ్చాడు. తాను తిరిగి అక్కడకు వెళ్లనని మారాం చేశాడు.
అంతేకాదు బోరున విలపించాడు కూడా. ఈ క్రమంలో కన్నతల్లి బాలుడ్ని తల్లి దగ్గరికి తీసుకుని అక్కడ ఏం జరిగింది అనేదానిపై ఆరా తీసింది. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు, విచారణ చేపట్టారు. తొలుత బాధితుడు ఒక్కడేనని పోలీసులు భావించారు. ఆ తర్వాత తీగలాగితే డొంక కదిలింది.
జువైనల్స్‌పై బాలురులపై లైంగిక దాడి!
మొత్తం ఆరుగురు బాలురుపై లైంగిక దాడి జరిగినట్టు తేలింది. ఇలాంటి హోమ్‌లో చిన్నారులను కంటికి రెప్పగా కాపాడాల్సిన స్టాఫ్‌గార్డు మృగంగా మారిపోయాడు. అభం శుభం తెలియని బాలురులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కొంతకాలంగా ఆ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు సదరు గార్డు. ఆ క్రమంలో అస్వస్థతకు గురికావడంతో ఇంటికి తరలించారు. బాలుడు ఇంట్లో అనారోగ్యం బారినపడ్డాడు.
వెంటనే ఆసుపత్రికి తరలించారు తల్లి. బాలుడ్ని పరీక్షించిన వైద్యులు, లైంగిక దాడికి పాల్పడినట్టు తేల్చారు. డాక్టర్లు ఇచ్చిన సమాచారంతో బాలుడి నుంచి సమాచారం రాబట్టింది కన్నతల్లి. ఆ తర్వాత జరిగిన ఘటన గురించి వివరించాడు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఆ ప్రాంత పోలీసులు, సైదాబాద్ పోలీసులకు ట్రాన్స్‌ఫర్ చేశారు.
ALSO READ: కడపలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. స్టాఫ్‌గార్డుని అదుపులోకి తీసుకుననారు. స్టాఫ్‌గార్డుతోపాటు మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలసదన్‌లో వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంతో దీనికి కారణంగా తెలుస్తోంది. ఈ కేసులో ఇంకెంతమంది బయటపడతారో చూడాలి.
షాకింగ్.. నలుగురు జువైనల్స్‌పై లైంగిక దాడి..!
సైదాబాద్ బాలసదన్‌లో దారుణం
హోమ్‌లో ఉన్న బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన స్టాప్ గార్డ్
అనుమతి లేకుండా బాలుడిని ఇంటికి పంపించిన స్టాఫ్ గార్డ్
ఇంటికి వెళ్లిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చెక్ చేయించగా బాలుడిపై లైంగిక… pic.twitter.com/aQVPMuvp3p
— BIG TV Breaking News (@bigtvtelugu) October 13, 2025