Subhashree Rayaguru Latest Photos: బిగ్ బాస్ అనే రియాలిటీ షో ఎంతోమంది జీవితాలను మార్చేసింది. మామూలుగా ఈ షోలోకి వచ్చినవారు సెలబ్రిటీలు అని అంటుంటారు. కానీ చాలావరకు ఈ షో నుండి వెళ్లిపోయిన తర్వాతే సెలబ్రిటీలు అవుతున్నారు. అందులో ఒకరు శుభశ్రీ రాయగురు. (Image Source: Subhashree Rayaguru/Instagram)
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్‌గా ఎంటర్ అయ్యింది శుభశ్రీ. అందులోకి వచ్చిన తర్వాత అందరూ తనను ప్రేమగా సుబ్బు అని పిలవడంతో ఆడియన్స్‌కు కూడా అలాగే గుర్తుండిపోయింది. (Image Source: Subhashree Rayaguru/Instagram)
తను బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మంచి గుర్తింపు సాధించుకున్నా కూడా తన ఎలిమినేషన్ అన్యాయంగా జరిగిందని ప్రేక్షకులు ఫీలయ్యారు. కానీ బయటికి వచ్చేసిన తర్వాత తన కెరీర్ మరో మలుపు తిరిగింది. (Image Source: Subhashree Rayaguru/Instagram)
మామూలుగా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత అందులో పాల్గొన్నవారికి సినిమాల్లో, సీరియల్స్‌లో అవకాశాలు వచ్చినా రాకపోయినా సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా కెరీర్‌ను కొనసాగిస్తారు. శుభశ్రీ కూడా ఇప్పుడు అదే కేటగిరిలో ఉంది. (Image Source: Subhashree Rayaguru/Instagram)
ప్రస్తుతం శుభశ్రీకి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్, యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్లు బాగానే ఉన్నారు. రీల్స్, వీడియోలతో వారిని తరచు అలరిస్తూనే ఉంటుంది. (Image Source: Subhashree Rayaguru/Instagram)
శుభశ్రీకి కవర్ సాంగ్స్, ఆల్బమ్ సాంగ్స్‌లో నటించడానికి కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటివరకు తను నటించిన ఆల్బమ్ సాంగ్స్ అన్నీ హిట్టే. (Image Source: Subhashree Rayaguru/Instagram)
తాజాగా ‘దేవర’ సినిమాలో జాన్వీ కపూర్‌లాగా ముస్తాబయ్యి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా కుర్రకారు చూపు మొత్తం తన చిట్టి నడుముపైనే ఉంది. (Image Source: Subhashree Rayaguru/Instagram)