BigTV English

Kanguva Collections: ఇవి జెన్యూన్ కలక్షన్స్ లా ఉన్నాయి బాసు

Kanguva Collections: ఇవి జెన్యూన్ కలక్షన్స్ లా ఉన్నాయి బాసు

Kanguva Collections: సౌత్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా కంగువ. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య నేడు విడుదలైంది. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి చిత్ర యూనిట్ భారీ ఎత్తున ప్రమోషన్స్ జరిపింది. అన్ని భాషల్లో కూడా ప్రేక్షకులకు దగ్గరయ్యే విధంగా ఈ సినిమాను ప్లాన్ చేశారు. వాస్తవానికి ఈ సినిమాకి ఉన్న దాని కంటే కూడా ఎక్కువ హైప్ ఈ చిత్ర యూనిట్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఈ చిత్రం నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ సినిమా దాదాపు 2000 కోట్లు కలెక్షన్స్ వసూలు చేస్తుంది అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ లో ఈ పాసెస్ మీ దగ్గరే పెట్టుకోండి, సక్సెస్ మీట్ డిసెంబర్ నెలలో పెట్టబోతున్న అప్పుడు ఇవి పనికి వస్తాయంటూ కూడా చెప్పాడు.


తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బాహుబలి (Bahubali) సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. ఒక్కసారిగా తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచ వ్యాప్తంగా తెలిసేలా చేశాడు ఎస్.ఎస్ రాజమౌళి. అయితే అప్పటినుంచి మిగతా ఇండస్ట్రీలో కూడా రాజమౌళితో పోటీ పడటం మొదలుపెట్టారు. బాహుబలి లాంటి సినిమాను చేయాలని చాలామంది ప్రయత్నాలు కూడా చేశారు. మణిరత్నం లాంటి దర్శకులు పొన్నియన్ సెల్వన్ తెరకెక్కించిన ఆ సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కానీ తమిళ్ ప్రేక్షకులు మాత్రం బాగానే ఆకట్టుకుంది మంచి కలెక్షన్స్ రాబెట్టింది. ఇక తమిళ్ బాహుబలి అంటూ వచ్చిన కంగువా సినిమా మొదటి రోజు నుంచి నెగిటివ్ టాక్ ను సాధించుకుంది. పోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 58 కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కలెక్షన్స్ కొంతమేరకు నమ్మశక్యంగా ఉన్నాయి అని చెప్పాలి.

Also Read : Pongal Movies: లెక్క తేలింది.. ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ అంటే..?


మామూలుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఫిలిం మేకర్స్ ఫేక్ కలెక్షన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఆ సినిమా కలెక్షన్స్ ఎంతవరకు నిజమో అని ఎవరు చెప్పలేరు. నాగ వంశీ లాంటి నిర్మాత కూడా కేవలం ఆడియన్స్ ను సాటిస్ఫై చేయడానికి మాత్రమే కలెక్షన్స్ పోస్టర్ మీద వేస్తారు అంటూ చాలా సార్లు స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే కొంగువా తెలుగు సినిమా ఇవ్వండి ఈపాటికి 100 కోట్లు పోస్టర్ కనిపించేది. దీన్ని బట్టి చూస్తే తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని అనిపిస్తుంది. ఏదేమైనా జ్ఞాన వేల్ రాజా చెప్పినట్లు 2000 కోట్లు రావాలంటే దాదాపుగా ఇంకో 1940 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతున్నట్లు అధికారికంగానే ప్రకటించారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×