Unstoppable Allu Arjun Episode: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఆయన సతీమణి స్నేహ రెడ్డి(Sneha Reddy) జోడి గురించి పరిచయాలు అవసరం లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ సినిమాలలో బిజీగా ఉంటే.. స్నేహ రెడ్డి ఫిట్నెస్ ఫ్రీక్ అనిపించుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అలాగే ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఆడియన్స్ కి దగ్గరవుతోంది. దీనికి తోడు తన పిల్లలతో వెకేషన్స్ కి వెళ్ళినా.. లేదా ఇంట్లో పిల్లలు చేసే ప్రతి చిన్న పనిని కూడా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వుంటుంది. అలాగే బన్నీ అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఈ జంటకు భారీ పాపులారిటీ ఉంది. ముఖ్యంగా బన్నీకి తన భార్య స్నేహ రెడ్డి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఆమెకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా తోడుగా ఉంటున్నారు బన్నీ.
అన్ స్టాపబుల్ షోలో బన్నీ..
ఇకపోతే ప్రస్తుతం బన్నీ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో పుష్ప -2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం. ప్రమోషన్స్ లో భాగంగా ఆహా ఓటీటీ వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో కి బన్నీ చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. ఇందులో బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ సీజన్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకోగా.. నాలుగవ సీజన్ కూడా ప్రారంభం అయింది. నాలుగవ సీజన్ మొదటి ఎపిసోడ్ కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ముఖ్యఅతిథిగా విచ్చేయగా.. రెండవ ఎపిసోడ్ కి దుల్కర్ సల్మాన్ (Dulquar salman)లక్కీ భాస్కర్ (Lucky bhaskar)టీం, మూడో ఎపిసోడ్ కి సూర్య (Suriya )కంగువ(Kanguva )టీం విచ్చేశారు. ఇక ఇప్పుడు నాల్గవ ఎపిసోడ్ కి పుష్ప-2 (Pushpa -2) సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ (Allu Arjun) విచ్చేశారు. ఇక బాలయ్య – అల్లు అర్జున్ మధ్య సంభాషణ చాలా ఆసక్తికరంగా సాగింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కు సంబంధించిన ఎన్నో విషయాలను బాలయ్య బాబు బయటపెట్టారు.
లవ్ మేటర్స్ రివీల్ చేసిన బన్నీ..
“వివాహానికి ముందు నీకు నువ్వు ఎవరినైనా ప్రేమించావా? లేక నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా..? నీ లవ్ విషయాల గురించి బయట పెట్టు” అంటూ బాలయ్య అడిగారు. దీనికి అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “అబ్బో చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి”. అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పటివరకు కాంట్రవర్సీ లలో తలదూర్చని అల్లు అర్జున్ వివాహానికి ముందు చాలామందితో లవ్ స్టోరీ నడిపాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇది విన్న నెటిజన్స్.. ఈ విషయం మీ భార్యకి తెలిస్తే పరిస్థితి ఏంటి? అని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్స్ వస్తాయని ముందే ఊహించారో ఏమో తెలియదు కానీ.. చాలామంది అమ్మాయిలు నన్ను లవ్ చేశారు. కానీ నేను లవ్ చేసిన మొదటి అమ్మాయి నా భార్య అంటూ ప్లేట్ తిప్పేశారు అల్లు అర్జున్. మొత్తానికైతే అల్లు అర్జున్ తెలివితేటలు ఇక్కడ బాగా పనిచేస్తున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ సరదాగా ఈ షోలో చెప్పినట్లు తెలుస్తోంది.