Taapsee Pannu: హీరోయిన్ తాప్సీ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు.

టాలీవుడ్‌లో యాపిల్ బ్యూటీగా ముద్ర పడిన ఢిల్లీ బ్యూటీ, ఫోకస్ అంతా బాలీవుడ్‌పై పెట్టినట్టు కనిపిస్తోంది.

దాదాపు దశాబ్దమున్నర కిందట గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ముఖ్యంగా టాలీవుడ్ ద్వారా అడుగుపెట్టిన ఈ సుందరి వెనుదిరిగి చూడలేదు.

కేవలం తెలుగు మాత్రమే కాకుండా తమిళం, అప్పుడప్పుడు మలయాళం మూవీలు చేసింది. కాసింత అనుభవం వచ్చాక బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది.. సరైన ప్రాజెక్టులు చేసింది.

గడిచిన రెండేళ్లుగా అక్కడే ప్రాజెక్టులు చేసింది. ప్రస్తుతం కొంత గ్యాప్ రావడంతో వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకునే పనిలో పడింది.

రీసెంట్‌గా ఓ ఈవెంట్‌కు తాప్సీ హాజరైంది. నార్మల్‌గా అయితే కాసింత ట్రెడిషన్, గ్లామర్ ఎక్స్‌పోజింగ్ కనబడతారు.

తాప్సీ మాత్రం కంప్లీట్‌గా తన లుక్ మార్చేసింది.. హాలీవుడ్ స్టయిల్‌లో మెరిసింది.

హెయిర్, డ్రెస్ ఇలా చెప్పుకుంటూ పోతే, చెప్పడం కంటే చూడడమే బెటర్ అని అంటున్నారు.

ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేద్దాం.