ENGW vs RSAW: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( ICC Womens World Cup 2025) దక్షిణాఫ్రికా మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఈ టోర్నమెంట్ లో ఫైనల్ కు దూసుకు వెళ్లింది దక్షిణాఫ్రికా. తాజాగా తొలి సెమీ ఫైనల్ లో ఇంగ్లాండ్ తో తలపడిన దక్షిణాఫ్రికా, 125 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ విజయంతో మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ఫైనల్ కు దూసుకు వెళ్లిన తొలి జట్టుగా సఫారీ జట్టు చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కు పురుషుల జట్టు కూడా ఇప్పటి వరకు చేరలేదు. కానీ దక్షిణాఫ్రికా మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ఫైనల్ కు చేరి, సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో దక్షిణాఫ్రికా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో ఉన్న దక్షిణాఫ్రికా.. ఫైనల్స్ లో ఆస్ట్రేలియా లేదా టీమిండియాతో తలపడనుంది. ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రేపు రెండో సెమీ ఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు దక్షిణాఫ్రికాతో ఫైనల్ నవంబర్ రెండో తారీఖు ఫైనల్స్ ఆడనుంది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియం ( Barsapara Cricket Stadium, Guwahati) వేదికగా జరిగింది. అయితే, ఈ మ్యాచ్ లో 125 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించి, ఫైనల్స్ కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 చేసింది. అయితే, ఈ భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు అట్టర్ ఫ్లాఫ్ అయింది. 42.3 ఓవర్లలో 194 పరుగులు చేసిన మహిళల ఇంగ్లాండ్ టీం ఆలౌట్ అయింది. ఈ తరుణంలోనే 125 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఇంగ్లాండ్ ఓటమి పాలైంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా ఫైనల్స్ కు దూసుకెళ్లింది.
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ( ICC Womens World Cup 2025) దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఫైనల్స్ వెళ్లిన తరుణంలో సరికొత్త రికార్డు నమోదు అయింది. 2023 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ కు కూడా సౌతాఫ్రికా చేరుకుంది. అలాగే, 2024 ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్స్ కు కూడా దక్షిణాఫ్రికా వెళ్లింది. ఇక ఇవాళ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ఫైనల్ వెళ్లింది.
Also Read: Indian Team: ఎముకలు కొరికే చలిలో టీమిండియా ప్రాక్టీస్.. చేతులు పగిలిపోతున్నాయి.. వీడియో వైరల్
South Africa create history — reaching their FIRST-ever World Cup final, men’s or women’s! 🇿🇦💥
The Proteas break the barrier after a stunning win over England! 🙌
Can they go all the way and bring the trophy home this time? 🏆#ENGvSA #CWC25 #Sportskeeda pic.twitter.com/9s8XZXqoIX
— Sportskeeda (@Sportskeeda) October 29, 2025