Longest Ttime Without Sleep: ఎవరైనా నిద్రపోకుండా ఎంతసేపు మెలకువగా ఉండగలరు? చాలా మందిలో ఆసక్తి కలిగించే ప్రశ్న ఇది. నిద్ర అనేది శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. కానీ, కొంత మంది ఎక్కువ కాలం నిద్రపోకుండా గడిపిన సందర్భాలున్నాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా వారాల తరబడి నిద్రపోని వ్యక్తులు ఉన్నారు. వారిలో కొంత మంది గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
19 రోజులు నిద్ర లేకుండా..
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన రాబర్ట్ మెక్ డొనాల్డ్ ప్రపంచంలోని ఎక్కువ రోజులు నిద్రపోని వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫర్ వరల్డ్ రికార్డును నెలకొల్పాడు. 1986లో ఆయన ఏకంగా 19 రోజుల పాటు మెలకువగా ఉండి ఈ అద్భుతమైన ఫీట్ సాధించాడు. మెక్ డొనాల్డ్ మొత్తం 453 గంటల 40 నిమిషాల పాటు మెలకువగా ఉండి ప్రపంచంలోనే ఎవరికీ సాధ్యం కాని రికార్డును సాధించాడు. ఇంకా నిద్రపోకుండా ఉంటానని ఆయన చెప్పినప్పటీ, వైద్యులు వారించారు. దీంతో ఆయన మూడు రోజుల పాటు కంటి నిండా నిద్రపోయారు. ఏండ్లు గడుస్తున్నా, ఇప్పటికీ ఆయన రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేకపోయారు.
11 రోజులు నిద్రలేకుండా గడిపిన 17 ఏండ్ల కుర్రాళ్లు
మెక్ డొనాల్డ్ రికార్డును బ్రేక్ చేసేందుకు ఇద్దరు 17 ఏండ్ల కుర్రాళ్లు ప్రయత్నించారు. రాండీ గార్డనర్, బ్రూస్ మెక్ అలిస్టర్ అనే విద్యార్థులు ఒక సైన్స్ ప్రాజెక్ట్ చేశారు. దీని కోసం వాళ్లు ఏకంగా 264 గంటలు.. అంటే 11 రోజులు మెలకువగా ఉండగలిగారు.
గార్డనర్ పై స్టాన్ ఫోర్డ్ సైంటిస్టుల పరిశోధన
రాండీ గార్డనర్ 11 రోజుల పాటు నిద్రపోకుండా ఉండటం గురించి స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకుడు డాక్టర్ విలియం డిమెంట్ స్టడీ చేశారు. బాస్కెట్ బాల్, ఆర్కేడ్ గేమ్ లను ఆడటం వల్ల ఆయన నిద్రకు దూరంగా ఉన్నప్పటికీ, శరీరం చాలా ప్రభావితం అయినట్లు గుర్తించారు. జ్ఞాపకశక్తిలో క్షీణత, కండరాల క్షీణత ఏర్పడినట్లు వెల్లడించారు. గార్డనర్ దీర్ఘకాలిక ప్రభావాలను పొందనప్పటికీ, తన 60వ దశకంలో నిద్రలేమితో బాధపడ్డారు. దాదాపు దశాబ్దం పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. అయినప్పటికీ రాత్రి 6 గంటలకు మించి నిద్రపోలేదు.
ఆ తర్వాత చాలా మంది ప్రయత్నించినా…
రాబర్ట్ మెక్ డొనాల్డ్ రికార్డు మాట అటుంచితే.. గార్డనర్ రికార్డును బ్రేక్ చేసేందుక చాలా మంది ప్రయత్నించారు. కానీ, సాధ్యం కాలేదు. 2007లో టోనీ రైట్ గార్డనర్ రికార్డును బ్రేక్ చేయాలి అనుకున్నారు. కానీ, కొద్ది రోజుల్లోనే ఆయన నిద్రలోకి జారుకున్నాడు. ఎక్కువ రోజులు నిద్రలేకుండా ఉండటం వల్ల నిద్ర లేమి సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆయన వెల్లడించారు. మానసికంగానూ చాలాఆ ఇబ్బందులు పడ్డట్లు చెప్పారు. అటు ఎక్కువ రోజులు నిద్రలేకుండా గడపడం వల్ల మానసికంగా, శారీరకంగా కుంగిపోయే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. అందుకే, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు రాత్రిపూట నిద్రపోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. లేదంటే బోలెడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు.
Read Also: ఇది ప్రపంచంలోనే అత్యంత అందమైన చిన్న ఇల్లు, ధర ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!