Dude OTT: ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ఇటీవల వరుస హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈయన నటించిన వరుస మూడు సినిమాలు ఏకంగా 100 కోట్ల క్లబ్ లోకి వెళ్లడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రదీప్ రంగనాథన్ మమిత బైజు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం డ్యూడ్. (Dude)ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డైరెక్టర్ కీర్తిశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్ ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో విడుదల అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్టోబర్ 17వ తేదీ థియేటర్లో విడుదలైన ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Net Flix)కైవసం చేసుకున్నారు నాలుగు వారాల థియేట్రికల్ రన్ అనంతరం ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని నవంబర్ 14వ తేదీ నుంచి డిజిటల్ మీడియాలో ప్రసారం చేయడానికి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
డ్యూడ్ సినిమా ఓటీటీ విడుదల గురించి త్వరలోనే నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వెలబడనుంది. ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 68.09 కోట్ల నెట్ వసూలు చేసింది. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో ఎంతో విజయవంతంగా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పోటీగా ఎన్నో సినిమాలు విడుదలైనప్పటికీ డ్యూడ్ కలెక్షన్లు ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి. ఇక ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం అయ్యే నాటికి కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
100 కోట్ల క్లబ్ లో వరుస సినిమాలు..
ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 106 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టగా ఇందులో ఓవర్సీస్ వసూళ్లు రూ. 27.4 కోట్లు ఉన్నట్టు తెలుస్తోంది. మరి థియేట్రికల్ రన్ పూర్తి అయ్యేనాటికి ఈ సినిమా ఎంత మొత్తంలో కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది.. ఇక ప్రదీప్ రంగనాథన్ ఇటీవల నటించిన డ్రాగన్, లవ్ టుడే సినిమాలు కూడా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టాయి. ఇక తాజాగా ఈ సినిమా కూడా 100 కోట్లను క్రాస్ చేయడంతో ప్రదీప్ రంగనాథన్ మార్కెట్ కూడా బాగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ప్రదీప్ రంగనాథ్ తదుపరి సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రదీప్ దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు.
Also Read: MassJathara vs Bahubali The Epic: మాస్ జాతర vs బాహుబలి ది ఎపిక్.. బాక్సాఫీస్ విజేత ఎవరు?