Rahul Ravindran: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది మల్టీ టాలెంటెడ్ యాక్టర్స్ ఉన్నారు. కేవలం నటులుగానే కాకుండా దర్శక రచయితలుగా కూడా పేరు సాధించుకున్నారు. ఎస్సార్ కళ్యాణ మండపం సినిమాతో కిరణ్ అబ్బవరం. ఫలక్నామా దాస్ సినిమాతో విశ్వక్సేన్. డీజే టిల్లు సినిమాతో సిద్దు జొన్నలగడ్డ, గూడచారి సినిమాతో శేష్ వంటి నటులు తమలో ఉన్న మరో టాలెంట్ కూడా బయటపెట్టారు.
అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నటుడుగా పరిచయమైన రాహుల్ రవీంద్రన్. తన కెరియర్లో ఎన్నో మంచి పాత్రలను చేశారు. అయితే చిల సౌ అనే సినిమాతో దర్శకుడుగా మారాడు రాహుల్ రవీంద్రన్. ఆ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఏకంగా నేషనల్ అవార్డు కూడా ఆ సినిమాకు వచ్చింది. అయితే నాగార్జున హీరోగా చేసిన మన్మధుడు 2 సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇప్పుడు మళ్లీ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాతో దర్శకుడుగా మారాడు రాహుల్ రవీంద్రన్.
రాహుల్ రవీంద్ర నటుడుగా చాలామంది స్టార్ హీరోలు సినిమాలలో కనిపించాడు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలో రాహుల్ రవీంద్రన్ ఒక కీలక పాత్రలో కనిపించాడు. మహేష్ బాబు తో కూడా అతనికి కాంబినేషన్ సీన్స్ ఉంటాయి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలోని ఒక పాత్ర కోసం రాహుల్ రవీంద్రను అడిగితే రిజెక్ట్ చేశారట. కానీ సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించారు. దీనికి కారణం ఏంటంటే సుజిత్ పనిచేసే విధానం దగ్గర నుంచి చూడాలి అని అనుకున్నాడట రాహుల్.
అత్తారింటికి దారేది సినిమా విషయానికి వస్తే పెద్దగా రాహుల్ రవీంద్రన్ లాంటి ఒక వ్యక్తి చేయాల్సిన క్యారెక్టర్స్ ఏమీ లేవు. అయితే కొన్ని విషయాల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్రకు ఊహించిన స్థాయిలో ప్రాముఖ్యత లేకపోయినా కూడా కొంతమందిని కాస్ట్ చేస్తూ ఉంటారు.
దీని గురించి ఉదాహరణలు చెప్పడానికి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండటం అనేది అనవసరం. ఇదే విషయాన్ని సందీప్ రెడ్డి వంగ బాలకృష్ణతో అన్ స్టాపబుల్ షో లో చెప్పారు. త్రివిక్రమ్ లో నచ్చని విషయం ఏంటి అని అంటే ప్రతి సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు అంటూ మాట్లాడారు. కానీ యాదృచ్ఛికంగా సందీప్ రెడ్డి వంగా సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు ఉంటుంటారు.
Also Read : Bigg Boss 9 : తనుజా కు ఎదురు తిరిగిన మాధురి, భరణి వచ్చాక వదిలేసింది అంటూ