Ravi Teja : బింబిసారా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వశిష్ట. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ సాధించింది. కళ్యాణ్ రామ్ లాంటి హీరోని పెట్టి సక్సెస్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ కి అప్పటికి సరైన హిట్ సినిమా లేదు. సరైన మార్కెట్ లేకపోయినా కూడా బింబిసారా తో మంచి సక్సెస్ అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాకు మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి.
ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించటంతో ఏకంగా రెండవ సినిమాకి మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం వశిష్ట చేస్తున్న విశ్వంభర సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా కొన్ని కారణాల వలన వాయిదా పడితే వచ్చింది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలన్నీ కూడా మొదటి టీజర్ రిలీజ్ అయినప్పుడు తగ్గిపోయాయి. వి ఎఫ్ ఎక్స్ విషయంలో అసలు కేరింగ్ తీసుకోలేదు అనే కామెంట్లు కూడా వచ్చాయి. మొత్తానికి రెండవ టీజర్ మాత్రం మంచి అంచనాలను పెంచింది.
ఇకపోతే వశిష్ట ప్రస్తుతం రవితేజతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. రవితేజకు వశిష్ట ఒక లైన్ చెప్పారట. అయితే విపరీతంగా ఆ లైన్ రవితేజకు నచ్చింది. ఖచ్చితంగా చేసే ఉద్దేశం రవితేజకు ఉంది అని తెలుస్తుంది. అయితే ఇంకా ఈ డిస్కషన్ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నాయి. ఒకసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత అధికారికంగా ఈ ప్రాజెక్టు గురించి ప్రకటించనున్నారు.
ఇకపోతే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కాన్సెప్ట్ కూడా ఎలా ఉండబోతుందో పలు రకాల ఇంటర్వ్యూస్ లో చెప్పాడు వశిష్ట. ఆల్మోస్ట్ సినిమా కథను కూడా చెప్పేసాడు. అయితే చూపించే విధానం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అని కాన్ఫిడెన్స్ వశిష్టకు ఉంది.
ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారు అని అప్పట్లో ప్రకటించారు. కానీ ఆ టైం కి గేమ్ చేంజర్ సినిమా ఉండడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఇప్పటికే క్లారిటీ లేదు. అలానే ప్రొడ్యూసర్స్ కూడా దర్శకుడు పైన పెద్దగా ఒత్తిడి తీసుకురావడం లేదు.
విశ్వంభర సినిమాకి సంబంధించి పూర్తిస్థాయి గ్రాఫిక్స్ ఎప్పుడైతే పూర్తవుతాయో అప్పుడే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించి 80% విఎఫ్ఎక్స్ వరకు పూర్తయిపోయింది. కంప్లీట్ గా విఎఫ్ఎక్స్ వర్క్ తో సంతృప్తి చెందిన తర్వాతే ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.
Also Read: Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాపై తుఫాన్ ప్రభావం, ఈవెంట్ క్యాన్సిల్