Bigg Boss 9 : బిగ్ బాస్ యాజమాన్యం తనుజకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది అని చాలామంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం స్టార్ మా ఛానల్లో తనూజ సీరియల్ చేయడం. అయితే తనకి సంబంధించి విపరీతంగా చాలామంది సపోర్ట్ కూడా చేస్తున్నారు. దీనిని చూస్తూ కొంతమంది ఆవిడకు స్ట్రాంగ్ పీఆర్ ఉంది అని కామెంట్స్ చేస్తున్నారు.
తనుజ హౌస్ లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా భరణిను నాన్న అని ఫీల్ అవ్వటం. అలానే తనతో ఒక బాండ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఒక తరుణంలో తనుజ వలన భరణి గేమ్ కూడా ఎఫెక్ట్ అయింది అంటూ బయట చాలా కామెంట్స్ వినిపించాయి. అయితే ఈ విషయాన్ని మాత్రం భరణి ఎప్పుడు ఒప్పుకోలేదు. తన వలన నా గేమ్ పోలేదు అంటూ కవర్ చేసుకుంటూనే వచ్చాడు.
వైల్డ్ కార్డు ఇంట్రెస్ట్ లో భాగంగా కొంతమంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిలో దువ్వాడ మాధురి కూడా ఒకరు. సోషల్ మీడియా వేదికగా దువ్వాడ మాదిరి బాగా పాపులర్ అయిపోయారు. దువ్వాడ శ్రీనివాస్ అనే ఒక పొలిటిషన్ తో ఉన్న రిలేషన్ వలన వీళ్ళిద్దరి గురించి విపరీతంగా ట్రోలింగ్ నడిచింది.
అయితే మాధురి కూడా కొన్ని విషయాల్లో గట్టిగా మాట్లాడుతూ అందరికీ సమాధానం చెప్పే ప్రయత్నాలు చేసింది. మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే శ్రీజ మీ పేరు మాధురి నా మాధవినా అని అడిగింది. అక్కడితో వీళ్ళిద్దరికీ మధ్య గొడవ మొదలైంది.
ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తనుజ ఇమ్మానియేల్ తో మాధురి యాంగ్రీ బర్డ్ అని అడిగింది. తనకు తెలియదు అని చెప్పాడు ఇమ్మానియేల్. వెంటనే కేవలం రెండు మూడు రోజుల్లోనే మాధురితో బాగా క్లోజ్ అయిపోయింది తనుజ. అయితే మొత్తానికి గత రెండు రోజులుగా తనుజపై మాధురి ఎదురు తిరిగింది అని చెప్పాలి.
మాధురికి సంజన కూడా చాలా సందర్భాలలో ఆ అమ్మాయి నటిస్తుంది అని తనుజ గురించి చెప్పింది. దానికి మాధురి సమాధానంగా నాకైతే జెన్యూన్ అనే అనిపిస్తుంది అంటూ ఆన్సర్ ఇచ్చింది. ఇక భరణి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. భరణి రీ ఎంట్రీ తర్వాత ఎక్కువగా తనతో మాట్లాడటం చేస్తోంది తనుజ.
ఈ విషయం పైన మాధురికి కోపం వచ్చినట్లుంది. అందుకే భరణి వచ్చిన తర్వాత తనను వదిలేసినట్లు సంజనాతో చెప్పింది. అంతేకాకుండా కిచెన్ లో కూడా వాళ్ళిద్దరికీ మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. నీకు నచ్చినట్లు చేస్తే అందరితోనే బానే ఉంటావు అని మాధురి అనేసరికి తనుజ ఫీల్ అయిపోయింది.
Also Read : Ravi Teja : చిరంజీవి దర్శకుడితో రవితేజ సినిమా, డిస్కషన్స్ జరుగుతున్నాయి