Pro Kabaddi League 2025: ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ లో ( Pro Kabaddi League 2025) అందరూ ఊహించిందే జరిగింది. సెమీ ఫైనల్ దాకా వచ్చిన మన తెలుగు టైటాన్స్ జట్టు అందరిని నిరాశపరిచింది. దాదాపు 5 సంవత్సరాలుగా చెత్త ప్రదర్శన కనబరుస్తున్న తెలుగు టైటాన్స్ ( Telugu Titans ).. ఈ సంవత్సరం అద్భుతంగా రాణించింది. ఈ నేపథ్యంలోనే సెమీ ఫైనల్ దాకా వెళ్లి సత్తా చాటింది. అయితే ఇవాళ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన తెలుగు టైటాన్స్ ఓడిపోయింది. దీంతో తెలుగు టైటాన్స్ ఇంటి దారి పట్టగా పుణేరి పల్టాన్ ( Puneri Paltan) ఫైనల్ కు చేరింది.
ప్రో కబడ్డీ 12వ సీజన్ లో ( Pro Kabaddi League 2025) భాగంగా క్వాలిఫైయర్ 2 మ్యాచ్ లో పుణేరి పల్టాన్ ( Puneri Paltan) వర్సెస్ తెలుగు టైటాన్స్ (Telugu Titans ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కి వెళ్తుంది అన్న సంగతి తెలిసిందే. దానికోసం తెలుగు టైటాన్స్ బాగానే కష్టపడింది. కానీ చివరలో పుణేరి పల్టాన్ అద్భుతంగా రాణించిన నేపథ్యంలో తెలుగు టైటాన్స్ ఓడిపోవడం జరిగింది. ఈ కీలక మ్యాచ్ లో 45 – 50 పాయింట్ల తేడాతో తెలుగు టైటాన్స్ జట్టుపైన పుణేరి పల్టాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.
దీంతో ఫైనల్ కు చేరుకుంది పుణేరి పల్టాన్ జట్టు. ఫస్ట్ హాఫ్ లో తెలుగు టైటాన్స్ ఆధిక్యం కనబరిచింది. కానీ సెకండ్ హాఫ్ లో చేతులు ఎత్తేసింది. తెలుగు టైటాన్స్ జట్టుకు సంబంధించిన భరత్ ఒక్కడే 23 పాయిట్లతో చెలరేగిపోయాడు. అతడు ఒంటరి పోరాటం చేసినప్పటికీ, తెలుగు టైటాన్స్ ప్లేయర్లు పెద్దగా రాణించలేదు. దీంతో చివరకు తెలుగు టైటాన్స్ ఓడిపోవాల్సి వచ్చింది. ఈ ఓటమితో ఇంటి దారి పట్టింది తెలుగు టైటాన్స్. అటు ఫైనల్ కు పుణేరి పల్టాన్ చేరింది. ఫైనల్స్ లో ఎల్లుండి దబాంగ్ ఢిల్లీతో తేల్చుకోనుంది పుణేరి పల్టాన్.
తెలుగు టైటాన్స్ ఇంటి దారి పట్టిన నేపథ్యంలో ప్రో కబడ్డీ 2025 టోర్నమెంట్ ఫైనల్ జట్లు ఏవి అనేది తేలిపోయింది. ఎల్లుండి అంటే శుక్రవారం రోజున ప్రో కబడ్డీ సీజన్ 12 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో దబాంగ్ ఢిల్లీ వర్సెస్ పుణేరి పల్టాన్ మద్యం మ్యాచ్ ఉంటుంది. సాయంత్రమే ఈ మ్యాచ్ ఎప్పటిలాగా నిర్వహిస్తారు. జియో హాట్ స్టార్ లో ఉచితంగా ఈ ప్రో కబడ్డీ ఫైనల్ మ్యాచ్ చూడవచ్చు. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రసారాలు అందిస్తున్నారు. అయితే ఫైనల్స్ లో ఢిల్లీ దబాంగ్ విజయం సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఈ జట్టులో ఎవరు గెలుస్తారో చూడాలి.
Also Read: Indian Team: ఎముకలు కొరికే చలిలో టీమిండియా ప్రాక్టీస్.. చేతులు పగిలిపోతున్నాయి.. వీడియో వైరల్
Please Give Player of the Match to Ajit Pawar 🙂#TeluguTitans pic.twitter.com/5N3gz1RwGP
— Meme Raja (@Meme_Raaja) October 29, 2025