E-Paper
Advertisement

Deepika Padukone: దీపికాకు మరో షాక్ ఇచ్చిన కల్కి టీమ్.. ఇంత పగ పట్టారేంటీ?

Deepika Padukone: దీపికాకు మరో షాక్ ఇచ్చిన కల్కి టీమ్.. ఇంత పగ పట్టారేంటీ?
Advertisement

Deepika Padukone: దీపికా పదుకొనే(Deepika Padukone) బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమెకు సౌత్ ఇండస్ట్రీలో కూడా అదే స్థాయిలో ఆదరణ ఉంది. ఇప్పటివరకు బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన దీపిక ఇదివరకు ప్రభాస్(Prabhas) హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా(Kalki Movie) ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు .మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె తదుపరి పాన్ ఇండియా ప్రాజెక్టులలో సినిమా అవకాశాలను అందుకున్నారు. అయితే గత కొద్దిరోజులుగా సౌత్ సినిమాల నుంచి దీపికా పదుకొనికి ఊహించని షాక్ తగులుతోందని చెప్పాలి.

కల్కి 2 నుంచి దీపిక ఔట్…

ఇటీవల పని గంటల విషయంపై ఈమె వార్తల్లో నిలిచారు ఇలా ఎక్కువ గంటల పాటు పనిచేయని చెప్పడంతో ఈమె పాన్ ఇండియా ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. ఇలా సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా నుంచి దీపికా తప్పుకోవడంతో కల్కి 2 నుంచి కూడా ఈమెను తొలగించినట్లు చిత్రబృందం అధికారకంగా వెల్లడించారు. ఇలా పాన్ ఇండియా ప్రాజెక్టుల నుంచి దీపికను తప్పించడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు అయితే తాజాగా కల్కి చిత్ర బృందం నుంచి దీపికా పదుకొనేకు మరో షాక్ తగిలింది.

ఎండ్ క్రెడిట్స్‌లో కనిపించని దీపికా పేరు..

Advertisement

కల్కి థియేటర్లలో ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకొని ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఓటీటీలో ఈ సినిమా ప్రసారమవుతున్న నేపథ్యంలో సినిమా ఎండ్ క్రెడిట్స్‌లో దీపికా పేరు మిస్సయింది. ఈ విధంగా ఎండ్ కార్డ్ టైటిల్స్ నుంచి దీపిక పేరును తొలగించిన విషయాన్ని అభిమానులు గమనించడంతో ఈ విషయం పట్ల తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా దీపిక పేరును తొలగించిన నేపథ్యంలో అభిమానులు అన్ ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్స్ అంటూ చిత్ర బృందంపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా దీపిక పేరు తొలగించిన నేపథ్యంలో మరోసారి కల్కి సినిమా హాట్ టాపిక్ గా మారింది.

అల్లు అర్జున్ సినిమాలో బిజీగా..

Advertisement

మరి ఈ విషయంపై దీపికా పదుకొనే స్పందిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుంచి దీపిక తప్పుకోవడంతో తదుపరి ఈ ప్రాజెక్టులో ఎవరు భాగం కాబోతున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇప్పటికే తెరపైకి చాలా మంది హీరోయిన్ల పేర్లు వచ్చాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం ఎవరిని అధికారకంగా ప్రకటించలేదు. ఇక దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈమె అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమా పనులలో దీపిక ఎంతో బిజీగా గడుపుతున్నారు. వీటితో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్నారు. ఏది ఏమైనా ఇటీవల కాలంలో దీపిక తరచు ఇలాంటి వార్తలలో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారారు.

AlsoRead: Dude OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన డ్యూడ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Related News

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

రజినీ జైలర్ 2 కథ ఇదేనా? ఈసారి టార్గెట్ ఎవరో తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×