Tamannaah: తమన్నా గ్లామర్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు గడిచింది.
కేవలం టాలీవుడ్‌కి పరిమితం కాకుండా కోలీవుడ్, హిందీలో కూడా హంగామా చేస్తోంది.
ఆఫర్లు కూడా అంది పుచ్చుకుంటుంది. రీసెంట్‌గా అంటే డిసెంబర్ 7న దుబాయ్ టూరేసింది ఈ బ్యూటీ.
‘ద- బాంగ్ రీలోడెడ్’ అనే కార్యక్రమంలో సల్మాన్ ఖాన్‌తో కలిసి స్టేజ్‌పై ప్రదర్శన చేసింది.
అద్భుతమైన ప్రదర్శనను ప్రేక్షకులను అలరించింది. తన ఐకానిక్ డ్యాన్స్‌తో చూపరులను ఆకట్టుకుంది.
ఆమె డైనమిక్ పెర్ఫార్మెన్స్‌ని చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. మిగతా హీరోయిన్స్ వచ్చినా తమన్నా క్రేజ్ ఎవరికీ రాలేదనే టాన్ బలంగా వినిపిస్తోంది.
మొత్తానికి ఇయర్ చివరలో దుబాయ్ టూర్ సక్సెస్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉంది ఈ బ్యూటీ.
ఈ క్రమంలో వెరైటీ డ్రెస్‌తో షూట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో గిరగిరా తిరిగేస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.