The Girlfriend Teaser: ప్రస్తుతం సౌత్‌లోనే కాదు.. నార్త్‌లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక మందనా (Rashmika Mandanna). తను ఏ సినిమా చేసినా పక్కా హిట్ అని మేకర్స్ సైతం నమ్మడం మొదలుపెట్టారు. రష్మిక ప్రొఫెషనల్ లైఫ్ గురించి మాత్రమే కాదు.. పర్సనల్ లైఫ్ గురించి కూడా ఎప్పటికప్పుడు ప్రేక్షకులు మాట్లాడుకుంటూనే ఉంటారు. రష్మిక, విజయ్ దేవరకొండ ప్రేమాయణం గురించి అధికారిక ప్రకటన మాత్రమే రాలేదు. కానీ వీరిద్దరూ లవర్స్ అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. తాజాగా రష్మిక హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌ను విజయ్ దేవరకొండ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఇందులో తన ప్రేయసి కోసం విజయ్ చెప్పే కవిత్వంతో ప్రేమలో పడిపోవాల్సిందే.
అందమైన కవిత్వం
ఒక కాలేజ్ స్టూడెంట్‌గా హాస్టల్‌లోకి రష్మిక మందనా మొదటిసారి అడుగుపెడుతుండడంతో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ (The Girlfriend) టీజర్ మొదలవుతుంది. అప్పుడే విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో అందమైన కవిత్వం మొదలవుతుంది. ‘‘నయనం నయనం కలిసే తరుణం. యెదన పరుగే పెరిగే వేగం. నా కదిలే మనసును అడిగా సాయం. ఇక మీదట నువ్వే దానికి గమ్యం. విసిరిన నవ్వులో వెలుగును చూశా. నవ్వాపితే పగిలే చీకటి తెలుసా.. నీకని మనసును రాసిచ్చేశా. పడ్డానేమో ప్రేమలో బహుశా’’ అనే కవితతో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్ మరింత అందంగా మారింది. తను కవిత్వం చెప్తున్నంత సేపు గర్ల్‌ఫ్రెండ్‌గా రష్మిక, బాయ్‌ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) మధ్య జరిగే సన్నివేశాలు కనిపిస్తాయి.
Also Read: అలాంటి ప్రేమ ఎప్పటికీ దొరకదు.. సమంత పోస్ట్ వైరల్..!
అన్నీ హైలెట్సే
‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌లో విజయ్ దేవరకొండ కవిత్వమే హైలెట్‌గా నిలిచింది. ఇక ఇందులో రష్మికకు కేవలం ఒక్క డైలాగ్ మాత్రమే ఉంది. ‘‘ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా అస్సలు పడను’’ అని రష్మిక చెప్పడంతో ఈ టీజర్ ముగుస్తుంది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్‌లో హైలెట్‌గా నిలిచిన మరొక విషయం హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం. విజయ్ దేవరకొండ కవిత్వం, రష్మిక, దీక్షిత్ మధ్య సీన్స్ చూపిస్తున్న సమయంలో హేషమ్ పాడిన ఒక పాట బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతూ ఉంటుంది. అలా టీజర్ మొత్తం యూత్‌ను ఇంప్రెస్ చేసే ఎలిమెంట్స్‌తో నిండిపోయింది. అలాగే సినిమా కూడా కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు.
విజయ్ నమ్మకం
నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran).. ‘చిలసౌ’ సినిమాతో దర్శకుడిగా మారాడు. తన దర్శకత్వంలో తెరకెక్కిన మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డ్ అందుకున్నాడు. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ అంటే సినిమా కచ్చితంగా బాగుంటుందని చాలామంది ప్రేక్షకులు ఇప్పటికీ ఫీలవుతున్నారు. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ టీజర్ చూస్తుంటే డైరెక్టర్‌గా తన ఖాతాలో మరొక హిట్ పడడం ఖాయమని అనుకుంటున్నారు. నటిగా రష్మికకు మరింత బాధ్యత ఇచ్చే కథ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ అని, ఆ బాధ్యతను తను కచ్చితంగా నిలబెట్టుకుంటుందని టీజర్ విడుదల చేసిన విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నమ్మకం వ్యక్తం చేశాడు.