Shani Budh Yuti 2025: 2024 సంవత్సరం ఇప్పుడు చివరి దశలో ఉంది. ప్రతి ఒక్కరూ కొత్త సంవత్సరం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొత్త సంవత్సరం 2025 జనవరి 01 నుండి ప్రారంభమవుతుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, 2025 సంవత్సరంలో, అనేక ప్రధాన గ్రహాల రాశిచక్రాలు మారి, సంయోగం ఏర్పడుతుంది. ఒక రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు సంచరిస్తే దానిని సంయోగం అంటారు.
గ్రహాల కలయిక మొత్తం 12 రాశుల ప్రజలపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. వేద పంచాంగం ప్రకారం, 2025 సంవత్సరం ప్రారంభంలో, ఒకదానికొకటి స్నేహపూర్వకంగా ఉన్న రెండు గ్రహాలు సంయోగం చేస్తాయి. 2025 మొదటి నెలలో కుంభరాశిలో బుధుడు , ఫలితాలను ఇచ్చే శని యొక్క శుభ కలయిక ఉండనుంది.
వైదిక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సుమారు 30 సంవత్సరాల తర్వాత, కుంభరాశిలో శని , బుధుల కలయిక ఏర్పడబోతోంది. 30 సంవత్సరాల తరువాత కుంభరాశిలో శని-బుధుడు ఈ కలయిక కొన్ని రాశిలకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి 2025 సంవత్సరంలో అనేక రకాల శుభవార్తలు, గొప్ప విజయాలు అందుతాయి. 2025 సంవత్సరంలో బుధుడు, శని సంయోగం వల్ల ఏ రాశుల వారు ఎక్కువ ప్రయోజనం పొందగలరో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి :
మేషరాశి వారికి 2025 సంవత్సరం ప్రారంభంలో రెండు స్నేహపూర్వక గ్రహాల కలయిక మంచి ప్రయోజనాలను తెస్తుంది. కొత్త సంవత్సరం 2025 మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీరు అనేక కొత్త ఆదాయ వనరులను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం, వారి కెరీర్‌లో కొత్త స్థానం కోసం మంచి అవకాశాలను పొందుతారు. బుధుడు, శని గ్రహాల కలయిక వల్ల 2025 సంవత్సరం విజయాలతో నిండి ఉంటుంది. డబ్బు పెట్టుబడి పెరుగుతుంది. మీకు శుభం కలుగుతుంది.
మకర రాశి:
మకర రాశి వారికి సంవత్సరం తొలినాళ్లలో బుధుడు, శని గ్రహాల కలయిక వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి.ఆఫీసుల్లో విజయం, కొత్త ప్రణాళికలు ఫలిస్తాయి. నూతన సంవత్సరంలో ప్రభావవంతమైన వ్యక్తుల మధ్య మంచి సంబంధాలు ఏర్పడతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావచ్చు. బుధుడు , శని గ్రహాల కలయిక మీకు కోర్టు కేసులలో విజయాన్ని తెస్తుంది. 2025లో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీ భవిష్యత్తు ప్రణాళికలు ఫలవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
Also Read: ఈ 4 వస్తువులను మీ ఇంట్లో దక్షిణ దిశలో ఉంచితే.. డబ్బుకు లోటుండదు
కుంభ రాశి:
కుంభరాశిలో శని, బుధుడు కలయిక కారణంగా, ఈ రాశి వారికి కొత్త సంవత్సరం చాలా అదృష్టవంతంగా, ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతాల పెరుగుదల , కొత్త ఉద్యోగం కోసం మంచి అవకాశాలు లభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతే కాకుండా ఆఫీసుల్లో మీ పని ప్రశంసించబడుతుంది. అవివాహితులైన వారికి మంచి వివాహ ప్రతిపాదనలు అందుతాయి. కుంభరాశిలో శని, బుధుల కలయిక జీవితంలో ఆనందం, శ్రేయస్సు, పురోగతి విజయాన్ని కలిగిస్తుంది.