Vedhika: హీరోయిన్ వేదిక గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది ఈ బ్యూటీ.. తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులిచ్చింది.
కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన విజయదశమి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించి.. మద్రాసి అనే మూవీతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఈ అమ్మడుకి కెరీర్ పరంగా అంతగా కలిసి రాలేదు.. ఎందుకో తెలీదు కానీ స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకోలేకపోయింది.
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి పలు భాషల్లో నటించింది. సినిమాలు ఏవి హిట్ కాకపోయిన తన అందం, అభినయంతో కుర్రకారు మనసును దోచేసింది ఈ చిన్నది.
తెలుగులో బాణం, దగ్గరగా దూరంగా, రూలర్, రజాకార్ వంటి పలు సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ.
ఈ మధ్యన ఓటీటీలో యక్షిణి అనే సిరీస్‌తో మనముందుకు వచ్చింది. ఈ సిరీస్‌లో నటనతో ప్రేక్షకులను అలరించింది.
ఈ భామకు సినిమాల్లో అంతగా క్రేజ్ దక్కకపోయిన.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ క్రేజీ సంపాదించుకుంది.
ఎప్పటికప్పుడు తన గ్లామర్ ధమాకాతో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుంది.
తాజాగా రెడ్ కలర్ డ్రెస్‌లో బుట్టబొమ్మలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ భామ.
ఈ ఫోటోలు చూసిన ఫాన్స్.. Graceful Modern Princess like look అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.