E-Paper
Advertisement

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
Advertisement

OTT Movie : రియల్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన కాంట్రవర్సీ సినిమా ‘ది బెంగాల్ ఫైల్స్’. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యాక సంచలనం క్రియేట్ చేసింది. బెంగాల్ విభజన నాటి హిందువుల ఊచకోత నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. దాదాపు మూడు గంటల ముప్పై నిమిషాలు రన్ టైమ్ తో ఈ స్టోరీ నడుస్తుంది. అయితే చరిత్రను వక్రీకరించారనే కారణంతో ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర అంతగా రాణించలేక పోయింది. ఈ మూవీ థియేటర్లో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది. ఇది ఏ ఓటీటీలోకి రాబోతోంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే

ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే

‘ది బెంగాల్ ఫైల్స్’ (The Bengal files) ఈ సినిమా 2025న సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైంది. జీ5లో నవంబర్ 21న ప్రీమియర్ కానుందని, జీ5 ఓటీటీ అనౌన్స్ మెంట్ చేసింది. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్స్ పై అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను 50 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తే 6 కోట్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి. వివేక్ అగ్నిహోత్రి ఇప్పటికే ది టష్కెంట్ ఫైల్స్ (2019), ది కశ్మీర్ ఫైల్స్ (2022) సినిమాలు తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

Advertisement

Read Also : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

కథ ఏమిటంటే?

1946 బెంగాల్‌లో జరిగిన రియల్ హిస్టారికల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీశారు. 1946 ఆగస్టు 16న ముస్లిం లీగ్ లీడర్ జిన్నా పాకిస్తాన్ కోసం హిందువుల మీద దాడులు స్టార్ట్ చేయమని చెప్తాడు. కలకత్తాలో మాస్ కిల్లింగ్స్ స్టార్ట్ అవుతాయి. ముస్లింలు హిందూ ఇళ్ల మీద దాడి చేసి, మగాళ్లని కాల్చి చంపేస్తారు. మహిళలపై అఘాయిత్యాలు చేస్తారు. ఈ ఘటనలో లక్షల మంది హిందువులు చనిపోతారు. ఈ కథ ఒక ఫ్యామిలీని ఫాలో అవుతూ వాళ్లు ఎలా టార్చర్ అవుతారో డిటెయిల్‌గా ఉంటుంది. హిందువులు రక్షణ లేకుండా పారిపోతారు, బ్రిటిష్ పోలీస్ లు సైలెంట్‌గా చూస్తూ ఉంటారు. మహాత్మా గాంధీ దీనికి నిరసనగా, నిరాహార ధీక్ష కూడా చేస్తాడు. కానీ సిచువేషన్ కంట్రోల్ కాదు. మహిళలపై చెప్పుకోలేని దారుణాలు జరుగుతాయి. కథ జెంట్ టైమ్‌కి కట్ అవుతుంది. అప్పుడు బతికిన వాళ్ళు ఇంకా హిస్టరీ రీరైట్ చేయమని ఫైట్ చేస్తారు. చివరికి మెసేజ్ బెంగాల్ నెక్స్ట్ కశ్మీర్ లాగా అవుతుందని వార్నింగ్ ఇస్తారు. ఈ సినిమాలో హిందూ వాదాన్ని గట్టిగా వినిపించారు.

Advertisement

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×