Rajinikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలన్ గా కెరియర్ మొదలుపెట్టిన రజనీకాంత్ హీరోగా కూడా ఎన్నో అద్భుతాన్ని సినిమాలు చేశారు. ఇప్పటికీ కూడా రజనీకాంత్ స్వాగ్, స్టైల్ వీటన్నిటికీ కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన కూలి సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక ప్రస్తుతం రజనీకాంత్ తన కెరీర్ల 173 వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాకి సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు.
రజనీకాంత్ మరియు కమల్ హాసన్ ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాకి లోకేష్ దర్శకత్వం వహిస్తాడు అని కూడా వినిపించింది కానీ కూలి సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈ ఆపర్చునిటీ పోయింది అనేది కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాట.
రజనీకాంత్ 173 వా సినిమాకి సుందర్సి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు సుందర్ సి. మొత్తానికి రజనీకాంత్ 173 సినిమాకి సంబంధించిన ఈరోజు వచ్చేసింది. ఈ సినిమాను కమల్ హాసన్ RKFI (రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్) రజనీకాంత్ 173వ సినిమాను నిర్మిస్తోంది. నిర్మాణ సంస్థ అధికారికంగా వీడియో కూడా విడుదల చేశారు.
ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2027వ సంవత్సరంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మించడంపై సర్వక్కర ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారికంగా మ్యూజిక్ డైరెక్టర్ ను ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. కానీ అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తాడు అని విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తుంది.
తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో పెద్ద హీరోలు చేసే ప్రాజెక్టులు అన్నీ కూడా సంగీత దర్శకుడుగా మాక్సిమం అనిరుద్ రవిచంద్రన్ చేస్తారు. రజనీకాంత్ కి పేట సినిమా నుంచి అద్భుతమైన మ్యూజిక్ అనిరుద్ ఇస్తున్నాడు. తెలుగులో బాలకృష్ణకి తమన్ ఏ రేంజ్ లో కొడతాడు తమిళ్లో రజనీకాంత్ కి అనిరుద్ అదే రేంజ్ ని మెయింటైన్ చేస్తాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వాస్తవానికి రజనీకాంత్ సినిమా అంటేనే అనిరుద్ కి పూనకాలు వస్తాయి.
Also Read: Anaganaga Oka raju : సంక్రాంతికి ఖాయం, అపోహలకు బ్రేక్ పడినట్లే, ప్రస్తుతం షూటింగ్ అక్కడే