Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లోకి కంటెస్టెంట్ తనుజ ఎంట్రీ ఇచ్చినప్పుడు కొన్ని విషయాలు మాట్లాడేసారో నాగార్జున. అన్నపూర్ణ ప్రోడక్ట్ అని చెప్పడం మెయిన్ మిస్టేక్. ఆ విషయం అప్పుడు అందరికీ అర్థం కాలేదు కానీ హౌస్లో రోజులు గడుస్తున్న కొద్దీ తనకి ఏ రేంజ్ లో సపోర్ట్ చేస్తున్నారు ఆడియన్స్ కి అర్థమైపోతుంది. అలానే తనుజా అని ఎవరైతే టార్గెట్ చేశారో, ఉన్నది ఉన్నట్లు ఎవరు మాట్లాడారో వాళ్ళందరూ కూడా హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు.
గతంలో రమ్య మోక్ష మాట్లాడుతూ నువ్వు ఒక ముసుగులో ఉన్నావు. నువ్వు ముసుగు బయటకు తీయడం లేదు. అని నామినేషన్ లో తన పాయింట్స్ అన్ని చెప్పింది. అప్పుడే వీరిద్దరికీ మధ్య విపరీతమైన ఆర్గ్యుమెంట్ జరిగింది. బయటకు వచ్చిన తర్వాత కూడా తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు తెలిపింది రమ్య మోక్ష. మరోవైపు శ్రీజ కూడా తనుజాకి బిగ్ బాస్ యాజమాన్యం ఎలా సపోర్ట్ చేస్తుందో చెప్పారు.
ప్రతి వారం నామినేషన్స్ జరుగుతాయి అన్న సంగతి తెలిసిందే. అయితే ఒక నామినేషన్స్ లో రాము రాథోడ్ చేయి పైన కళ్యాణ్ పేరు రాస్తూ నామినేట్ చేయమని చెప్పింది తనుజ. ఆ విషయం రాము రాథోడ్ కి షో చూసిన వాళ్లకి తప్ప ఎవరికీ పెద్దగా తెలియదు.
సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయింది. ఈ రోజుల్లో ఒక విషయాన్ని దాచటం అంతా తేలికైన పని కాదు. సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవ్వటం వలన నాగార్జున అలా చేతి మీద రాసి చెప్పడం కరెక్టా అని అడిగారు.
అయితే నాగార్జున అడుగుతున్న ప్రతిసారి ఆ టాపిక్ దాటేసే ప్రయత్నం చేసింది తనుజ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు నాగర్జున అడిగితే గాని ఉన్న విషయాన్ని బయటకు చెప్పలేదు తనుజ. అయితే చేసిన తప్పు తర్వాత కూడా నవ్వింది. మరోవైపు నాగార్జున కూడా దాని గురించి ఎక్కువ క్లాస్ తీసుకోకుండా మామూలుగా అడిగి వదిలేసారు.
చాలామంది హౌస్ మేట్స్ కి కూడా ఆ చెయ్యి పైన రాయడం అనేది నాగర్జున గారు ఎందుకు అడిగారు కూడా క్లారిటీ లేని పరిస్థితి. మొత్తానికి తనుజ ఆట తీరేంటో మరోసారి షో చూసే ప్రేక్షకులకు అర్థమైంది. తనుజ చేసింది చాలా పెద్ద తప్పు. కానీ నాగార్జున దానిని చాలా సులువుగా వదిలేశారు. అమ్మాయిలకు ఒక న్యాయం అబ్బాయిలకు ఒక న్యాయం చేస్తున్నారు అని ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి కామెంట్స్ రావడానికి కూడా ఇటువంటి సందర్భాలే ఉదాహరణలుగా మిగులుతున్నాయి.
Also Read: Bigg Boss 9 : పాపం భరణికి ఈ పరిస్థితి వస్తుంది అనుకోలేదు, తనను చూసి నేర్చుకోవాల్సింది ఇదే