Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కార్యక్రమం 9వ వారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమం 9 వారాలను పూర్తిచేసుకుంటున్న నేపథ్యంలో టాప్ 5 కంటెస్టెంట్లకు సంబంధించిన వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే తాజాగా ఇమ్మానుయేల్(Emmanuel) సోదరుడు వంశీ(Vamshi) బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఇమ్ము ఆట తీరు గురించి మాట్లాడారు. అందరూ తాను ఫేక్ గేమ్ ఆడుతున్నారని మాట్లాడుతున్నప్పటికీ వంశీ మాత్రం ఎందుకు అలా ఆడాల్సి వచ్చింది అనే విషయాలను స్పష్టంగా వివరించారు. అలాగే తనూజను టార్గెట్ చేశారంటూ ఇటీవల ఇమ్మూ గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై కూడా వంశీ క్లారిటీ ఇచ్చారు.
హౌస్ లో ఇమ్మానియేల్ చాలా అద్భుతంగా ఆడుతున్నారని తను ఎలాంటి మాస్క్ పెట్టుకోలేదని చాలా నిజాయితీగా ఆట ఆడుతున్నారని వంశీ తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో తన గురించి వస్తున్నటువంటి నెగటివ్ కామెంట్లపై కూడా స్పందించారు. ఇమ్మానుయేల్ ఆట తీరు గురించి విమర్శలు వచ్చిన పర్వాలేదు కానీ కుటుంబం గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఆ కామెంట్స్ చేసిన వారంతా కూడా ఫేక్ ఐడి నుంచే చేస్తున్నారని వారికి నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన వాళ్లు మాత్రం నెగిటివ్ కామెంట్లు చేయడం మానరని తెలిపారు.
ఇలా ఇమ్మానుయేల్ ఆటతీరు కారణంగా కుటుంబం పై నెగిటివ్ కామెంట్లు చేయడం చాలా బాధగా ఉందని తెలిపారు. చిన్నప్పటినుంచి నా తమ్ముడితో నేను కలిసి పెరిగానని అయితే ఇన్ని రోజులపాటు తనని వదిలి ఉండలేదని చాలా మిస్ అవుతున్నానని కూడా తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ల గురించి కూడా ప్రస్తావనకు రావడంతో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఎవరనే విషయంపై వంశీ ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. గత సీజన్లలో కొన్ని వారాలు గడిస్తేనే విన్నర్ ఎవరో టాప్ ఫైవ్ కంటెస్టెంట్లు ఎవరో చెప్పే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు ప్రతివారం కంటెస్టెంట్ల ఓటింగ్ తారుమారు అవుతుందని వంశీ తెలిపారు.
ఇక తన ఉద్దేశం ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్లుగా తనూజ, ఇమ్మానుయేల్, కళ్యాణ్, సుమన్ శెట్టి, ఇక రీతు చౌదరి లేదా డీమోన్ వీరిద్దరిలో ఎవరో ఒకరు టాప్ ఫైవ్ కి వెళ్ళవచ్చని అంచనా వేస్తూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ల గురించి తెలియజేశారు. అలాగే రీతు డెమోన్ బాండింగ్ గురించి కూడా ఈయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తను అలిగిన ప్రతిసారి డెమోన్ ఓదార్చడం చాలా బాగుందని, ఆయనకు చాలా ఓపిక ఎక్కువ అంటూ మాట్లాడారు.. నిజం చెప్పాలంటే అలాంటి వ్యక్తి ఎవరికీ ఉండకూడదు అంటూ వంశీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అలాగే ఇమ్మానుయేల్ , సంజన బాండింగ్ గురించి కూడా వంశీ మాట్లాడారు . ఇమ్ము ఎక్కువగా మా అమ్మతోనే టైం గడుపుతూ ఉంటారు. అందుకే సంజన గారితో కూడా అమ్మ అనే బాండింగ్ క్రియేట్ చేసుకుని తనకు ఏదైనా బాధ కలిగినప్పుడు సంజనా గారితో తన బాద మొత్తం చెప్పుకుంటున్నారని వంశీ తెలిపారు.
Also Read: Deepika Padukone: ఇండస్ట్రీలో వివక్షత ఉంది.. మళ్ళీ మొదలు పెట్టిన దీపిక!