Diwali Movies: దీపావళికి నాలుగు చిత్రాలు విడుదల కానుండగా అందులో రెండు తెలుగు చిత్రాలు.. మిగతా రెండు డబ్బింగ్ చిత్రాలు కావడం విశేషం. ఈ నాలుగు సినిమాలు ప్రమోషన్స్ విషయంలో గట్టిగా పోటీపడ్డాయి. ఇక థియేటర్ల విషయంలో కూడా వీటి మధ్య గట్టి పోటీనే ఉంది. తన అప్‌కమింగ్ మూవీ ‘క’ను ఎలాగైనా హిట్ చేయాలని పట్టుదలతో ఉన్న కిరణ్ అబ్బవరంకు థియేటర్ల విషయంలో కూడా అన్యాయమే జరిగినట్టు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ఏయే సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కాయి అనే విషయం బయటికొచ్చింది.
లక్కీ భాస్కర్
ఇతర మూడు సినిమాలను వెనక్కి నెట్టి హైదరాబాద్‌లో ఎక్కువ థియేటర్లను సంపాదించుకున్న సినిమా ‘లక్కీ భాస్కర్’ (Lucky Bashkar). వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు. తనకు జోడీగా మీనాక్షి చౌదరీ కనిపించనుంది. ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ నుండి కోటీశ్వరుడిగా ఎదిగిన భాస్కర్ కథ ఇది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన టీజర్, ట్రైలర్స్ అందరినీ ఆకట్టుకోగా ‘లక్కీ భాస్కర్’పై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏకంగా 401 థియేటర్లను ‘లక్కీ భాస్కర్’ దక్కించుకుంది.
అమరన్
డబ్బింగ్ సినిమా అయినా కూడా ‘అమరన్’కు తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. శివకార్తికేయన్, సాయి పల్లవి కలిసి ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్స్ వల్లే ఈ మూవీకి ఎక్కువ రీచ్ లభించింది. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవికథ ఆధారంగా తెరకెక్కిన సినిమా ఇది. భారత సైనికుల జీవితకథల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు చాలావరకు మంచి విజయాన్ని సాధించాయి. ‘అమరన్’ (Amaran) కూడా అదే కేటగిరిలో చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్‌లో ఈ మూవీకి 314 షోలు కేటాయించారు.
Also Read: ‘క’ సినిమాకు ఎగ్జిబిటర్స్ హ్యాండిచ్చారా..? ఇప్పుడు డబ్బులు ఎలా..?
భగీర
ఈసారి దీపావళికి ఒక కన్నడ చిత్రం కూడా పోటీకి దిగుతోంది. అదే ‘భగీర’ (Bagheera). కన్నడ ఇండస్ట్రీలో ప్రయాణాన్ని మొదలుపెట్టి ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. ఈ సినిమాకు కథను అందించాడు. శ్రీ మురళి హీరోగా నటించిన ఈ మూవీని సూరి డైరెక్ట్ చేశారు. కన్నడతో పాటు తెలుగులో కూడా ‘భగీర’కు బాగానే ప్రమోషన్స్ చేశారు. ఇక్కడ ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అయినా అవ్వకపోయినా థియేటర్ల విషయంలో మాత్రం మేకర్స్ గట్టిగానే పోటీపడ్డారు. అందుకే ఈ మూవీకి హైదరాబాద్‌లో 202 థియేటర్లు లభించాయి.
క
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) కెరీర్‌లో తెరకెక్కిన మొట్టమొదటి ప్యాన్ ఇండియా చిత్రం ‘క’. అందుకే ఈ సినిమాను ఎలాగైనా సక్సెస్ చేయాలని తను ఫిక్స్ అయ్యాడు. ప్రతీ భాషలో తాను ముందుగా వెళ్లి ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఈ సినిమాను ఆదరించాలని కోరుతున్నాడు. ఇంత జరుగుతున్నా కూడా ‘క’పై సరిపడా బజ్ క్రియేట్ అవ్వలేదు. ఇప్పుడు ఏకంగా థియేటర్ల విషయంలో కూడా ఈ మూవీకి అన్యాయం జరిగింది. హైదరాబాద్‌లో ‘క’(Ka)కు కేవలం 198 షోలు మాత్రమే కేటాయించారు. వాటితోనే కిరణ్ ఎంతవరకు కలెక్షన్స్ రాబట్టగలడో చూడాలి.