Shocking Video: ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న కారులో యువతి నగ్నంగా ఉన్న వీడియో వైరల్ అవుతుంది. ఆ యువతి కారు కిటికీలోంచి బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తుంది. ఆ కారు వెనకాల వస్తున్న వారు వీడియో తీసి సోషల్ మీడియా పోస్టు చేశారు. రాత్రి సమయంలో మహిళ ఇలా రెచ్చిపోయి ప్రవర్తించడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
?utm_source=ig_web_copy_link
లక్నో షహీద్ పాత్ లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కదులుతున్న కారు కిటికీ నుంచి ఒక యువతి బట్టలు లేకుండా నగ్నంగా బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తూ కనిపించింది. రాత్రి సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఓ యువతి ఇలా చేయడంతో స్థానికులు షాక్ అయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతంలో యువతి ప్రవర్తించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. యువతి చేష్టలను వెనుక కార్లలోని వారు వీడియో తీశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆ మహిళను, కారులో ఉన్నవారిని గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? లేదా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే