Bigg Boss 9 : బిగ్ బాస్ 9 లో ఉన్న కంటెస్టెంట్స్ లో భరణి ఒకరు. ముందు నుంచి ఈ సీజన్ లో చాలామంది విపరీతంగా భరణిని ఇష్టపడ్డారు. భరణి ఆట కూడా చాలామందిని ఆకర్షించింది. అయితే ఎప్పుడైతే తనుజ భరణిని నాన్న అని పిలవడం మొదలుపెట్టిందో అక్కడినుంచి గేమ్ మర్చిపోయి ఎమోషనల్ బాండింగ్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టాడు.
ఆ తర్వాత రెండు వారాల అయ్యాక హౌస్ లోకి దివ్య ఎంట్రీ ఇచ్చింది. బయటినుంచి భరణి గేమ్ చూసి వచ్చింది కాబట్టి అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే కొంత దూరం సాగిపోవచ్చు అనే ఆలోచన బహుశా తనకు కూడా ఉండి ఉండొచ్చు. హౌస్ లోకి వచ్చిన వెంటనే భరణితో బాగా క్లోజ్ అయింది. ఇప్పుడు కూడా ఈమెతో ఉన్న ఒక బాండింగ్ వలనే భరణి గేమ్ కూడా వీక్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్పాలి.
ప్రతివారం ఎలిమినేషన్ అనేది ఉంటున్న సంగతి తెలిసిందే. ఈవారం సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవ్వడానికి ముందు తనతో పాటు భరణి మిగిలాడు. ఎలిమినేషన్ అనౌన్స్ చేసే ముందు కాసేపు మాట్లాడుకునే అవకాశం అనేది జరుగుతుంది.
అయితే భరణి తనుజా ను ఒకవేళ నేను ఎలిమినేట్ అయితే సేవ్ చేసే ఛాన్స్ నీకు ఉంది కాబట్టి సేవ్ చేస్తావా అని అడిగాడు. అయితే అది నేను వేరే వాళ్ళకి ప్రామిస్ చేశాను అంటూ తనుజ చెప్పడం మొదలుపెట్టింది. భరణి అంత ప్రాదేయపడి అడగటం అనేది చూసే ఆడియన్స్ కి చాలా బాధగా అనిపిస్తుంది. మరోవైపు భరణి వైపు చూడడానికి కూడా ఇష్టపడలేదు తనుజ.
భరణి హౌస్ లోకి ఎంట్రీ అయినప్పటి నుంచి చాలామందికి ఉపయోగపడ్డాడు. అవసరమైతే కానీ ఎక్కువగా మాట్లాడలేదు. అయితే భరణి ఒక సందర్భంలో చాలామంది కెప్టెన్స్ అవ్వడానికి కూడా హెల్ప్ చేశాడు.
కానీ ఎప్పుడైతే భరణిని బిగ్ బాస్ యాజమాన్యం కూడా టార్గెట్ చేసిందో అప్పటినుంచి హౌస్ మేట్స్ అందరూ కూడా భరణిని పక్కన పెట్టడం మొదలుపెట్టారు. బిగ్ బాస్ లో భరణికి జరిగిన పరిస్థితులు చూస్తుంటే రియల్ లైఫ్ లో కూడా మనకు కొంత లెసన్ అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరిని ఈజీగా నమ్మేయడం వలన ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేయాలో భరణి గేమ్ ఒక ఉదాహరణ.
Also Read: Vijay Sethupathi : నువ్వు బెడ్ మీదే పడుకుంటున్నావా? ఆండ్రియా గురించి విజయ్ సేతుపతి ఇలా అనేసారేంటి?