Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ సీజన్ 9 డే 63 ఎపిసోడ్ లో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యాడు. కానీ చివర్లో భరణి – సాయి ఇద్దరూ మిగిలారు. ఈ ఎలిమినేషన్ ను మార్చే ఛాన్స్ ను నాగార్జున తనూజా చేతుల్లో పెట్టారు. కానీ ఈ అమ్మాయేమో భరణిపై పీకలదాకా కోపం ఉన్నా సరే అతన్ని బయటకు పంపే ఛాన్స్ ను మాత్రం వాడుకోలేదు. అసలు ఏం జరిగింది? ఎందుకు తనూజా ఇలాంటి పని చేసింది? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సీజన్ మొదటి నుంచి తనూజా – భరణి మధ్య బాండింగ్ అనేది ఎంత వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజానికి ముందు నాన్నా – కూతురు అంటూ ఇద్దరూ బాగానే ఉన్నారు. మధ్యలో దివ్య వచ్చి దూరాక వీళ్ళ బాండింగ్ కు బ్రేక్ పడింది. అంతేనా భరణి ఆ నెగెటివిటీతో ఎలిమినేట్ అవ్వడం, రీఎంట్రీ ఇవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే ముందు బానే ఉన్న దివ్య భరణి రీఎంట్రీతో తనూజాపై పగబట్టేసింది. అదిప్పుడు ముదిరి మొన్న కెప్టెన్సీ టాస్క్ లో తనూజాకు సపోర్ట్ చేసిన కళ్యాణ్ కు మాటిచ్చి, తప్పేదాకా వచ్చింది. దీంతో దివ్యకు ఈరోజు నాగార్జున క్లాస్ పీకారనుకోండి, అది వేరే విషయం. కానీ ఇప్పటికీ భరణి, తనూజాకు మధ్య అడ్డుగోడలా మారింది దివ్య. ఈరోజు టాస్క్ లో నాగార్జున ముందు భరణి ఎగ్జిట్ ఇచ్చిన తనూజా.. ఆయనతో మొదట్లోనే బాండింగ్ ఏర్పడింది. అప్పట్లోనే భరణి అందరినీ ఇన్ఫ్లూయెన్స్ చేస్తున్నారు. అందరూ ఆయన మాట వింటున్నారు అన్నారు. అయినా కూడా మేము బాగానే ఉన్నాము. గేమ్ కూడా బాగా ఆడాడు. అలా మొదటి మూడు వారాల్లో ఉన్న భరణి ఇప్పుడు లేడు” అంటూ ఇన్ డైరెక్ట్ గా భరణి గేమ్ పడిపోవడానికి దివ్యనే కారణం అని చెప్పింది తనూజ. అలాగే ఈరోజు భరణిని బయటకు పంపించే ఛాన్స్ ఉన్నా అస్సలు వాడుకోలేదు తనూజా.
అయితే ఎలిమినేషన్ చివరి రౌండ్ లో సాయితో పాటు భరణి కూడా ఉన్నాడు. దీంతో సాయి ఎలిమినేటెడ్ అని చెప్పి, తనూజాకున్న గోల్డెన్ బజర్ పవర్ ను కావాలంటే వాడుకోమన్నారు నాగార్జున. భరణి కూడా నిన్ను ఎప్పుడూ ఏదీ అడగలేదు. నాకోసం ఆ పవర్ వాడతావా? అని తనూజాను దీనంగా రిక్వెస్ట్ చేశాడు. అయితే నేను ఆల్రెడీ వేరే వాళ్ళకు మాట ఇచ్చాను అంటూ మాట దాటేసింది తనూజ. నిజానికి రీతూకి మాటైతే ఇచ్చింది గానీ ఇప్పటికీ తన చేతిలోనే ఉంది ఆ పవర్. చివరి నిమిషంలో గోల్డెన్ బజర్ వాడుకుని సాయిని ఆమె సేవ్ చేసి ఉంటే, భరణి ఎలిమినేట్ అయ్యేవాడు. కానీ తనూజ మనసు మార్చుకోలేదు. దీంతో సాయికి గుడ్ బై చెప్పారు. ఇదంతా చూస్తుంటే తనూజాకు ఇంకా నాన్న మీద హోప్స్ ఉన్నట్టుగా కన్పిస్తోంది. కానీ ఆయన ‘నాకు ఈ హౌస్ లో నీకన్నా ఇంకెవ్వరూ ముఖ్యం కాదు’ అంటూ దివ్యాకి చెప్పిన మాట తెలిస్తే ఏమైపోతుందో పాపం తనూజా.
Read Also : దివ్యకు నాగార్జున మాస్ వార్నింగ్… వీడియోలతో బండారం బట్టబయలు… తనూజా చేతుల్లో ఎలిమినేషన్