Hong Kong Sixes 2025 : పాకిస్తాన్ క్రికెట్ జట్టు హాంగ్ కాంగ్ సిక్సెస్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన 2025 ఎడిషన్ ఫైనల్ లో కువైట్ పై 43 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో పాకిస్తాన్ జట్టు ఆరోసారి ఛాంపియన్ గా నిలిచింది. అయితే ముహమ్మద్ షాజాద్ టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టాడు. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా 2024లో టీ 20 వరల్డ్ కప్ విజయం సాధించినప్పుడు, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజయం సాధించిన సమయంలో ట్రోఫీలతో ఫొటోలకు పోజులు ఇచ్చాడు. అలాగే పాకిస్తాన్ ఆటగాడు ముహమ్మద్ షాజాద్ కూడా హార్దిక్ పాండ్యాను కాపీ కొట్టాడు. దీంతో టీమిండియా క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ ఆటగాళ్లు ఇలా కూడా చేస్తారా..? అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేయడం విశేషం.
Also Read : T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్, వేదికలు ఇవే…హైదరాబాద్, విశాఖకు అన్యాయం ?
ఇక ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు నిర్ణీత 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అబ్బాస్ అఫ్రిది 11 బంతుల్లో 52 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ అయ్యాడు. అందులో 2 ఫోర్లు, 7 సిక్సర్లు బాది కువైట్ బౌలర్లను చీల్చి చెండాడు. ఓపెనర్ల అబ్దుల్ సమద్ 13 బంతుల్లో 4, ఖ్వాజా నఫె 6 బంతుల్లో 22 సైతం చెలరేగారు. షాహిద్ అజీజ్ డకౌట్ కగా.. మాద్ సదాకత్ 10, షెహజాద్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. కువైట్ బౌలర్లలో మీట్ భావర్ 3 వికెట్లు తీశాడు. భారీ లక్ష్య ఛేదనలో కువైట్ మెరుపు ఆరంభం లభించినప్పటికీ ఆ తరువాత వరుస వికెట్లు కోల్పోవడంతో 5.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 92 పరుగులకే పరిమితమైంది.
కువైట్ ఓపెనర్లు ద్నాన్ ఇద్రీస్ 8 బంతుల్లో 30, మీట్ భావ్సర్ 12 బంతుల్లో 33 చెలరేగినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. బిలాల్ తాహిర్,రవీజా సందరువన్ 1, యాసిన్ పటేల్ 14 తక్కువ స్కోర్లకే ఔట్ కావడంతో కువైట్ ఓటమి పాలైంది. దీంతో హాంకాంగ్ సిక్సెస్ 2025 టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ నిలిచింది. 2024లో శ్రీలంక విజేతగా నిలిచింది. పాకిస్తాన్ జట్టు రన్నరప్ గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ లో 43 పరుగుల తేడాతో కువైట్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది పాకిస్తాన్. దీంతో ఆరోసారి టైటిల్ ను సాధించింది. ఇప్పటికే 5 సార్లు ఛాంపియన్ గా నిలిచింది పాకిస్తాన్, 1992, 1997, 2001, 2002, 2011 సంవత్సరాల్లో హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్ విజేతగా పాకిస్తాన్ నిలిచింది. 2003, 2006, 2010, 2012, 2017, 2024 టోర్నమెంట్ లో రన్నరప్ గా పాకిస్తాన్ నిలిచింది. హాంకాంగ్ టోర్నమెంట్ లో ఎక్కువ సార్లు టైటిల్ గెలిచిన జట్టుగా పాకిస్తాన్ జట్టు నిలిచింది. అటు ఇండియాకు ఒకే ఒక్కసారి ట్రోఫీ దక్కింది. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ గెలిచి.. అన్ని ఓడి ఇంటి దారి పట్టింది. 2025 ఛాంపియన్ గా నిలిచిన పాకిస్తాన్ జట్టుకు ప్రైజ్ మనీ దాదాపు రూ.30 కోట్లు దక్కనున్నాయి.
Also Read : IPL 2026: SRH జట్టులో ఫిక్సింగ్..అంబానీతో చేతులు కలిపి దగా, కావ్యపాప స్కెచ్ చూడండి !
Hardik Pandya who? 😀 pic.twitter.com/qQhCczwPlq
— Nibraz Ramzan (@nibraz88cricket) November 9, 2025