Vimala Raman: మళ్లీ లైమ్ లైట్‌లోకి వచ్చేసింది హీరోయిన్ విమలా రామన్.
మధ్యలో కొన్ని రోజులు ప్రేక్షకులకు దూరమైనా మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఎన్నారై బ్యూటీ అయిన విమలా రామన్, కోలీవుడ్ ద్వారా అడుగుపెట్టింది.
మలయాళంలో ఫుల్‌స్వింగ్‌లోవున్న సమయంలో ఆమె రూటు మళ్లింది.
మూడేళ్లగా ఇటు తమిళం, అటు తెలుగులో దర్శనమిస్తోంది.
వున్నట్లుండి మళ్లీ రావడం వెనుక కారణమేంటని ప్రస్తుతానికి సీక్రెట్.
ప్రస్తుతం ఫ్యాన్స్ బేస్‌ను పెంచుకునే పనిలో పడింది. ఈ క్రమంలో తన అస్త్రాలను బయటపెడుతోంది.
తాను అప్పటి మాదిరిగానే ఉన్నానని, ఏ మాత్రం మారలేదని చెప్పే ప్రయత్నం చేసింది.
రీసెంట్‌గా శారీలో కాసింత రొమాంటిక్ లుక్‌లో దర్శనమచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.