Allu Arjun Arrest: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక ఈ సినిమాకి సీక్వల్ గా పుష్ప 2 సినిమా కూడా విడుదలైంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ అందుకుంటుంది. అతి త్వరగా వెయ్యి కోట్లు కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా ఈ సినిమా రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. డిసెంబర్ 4వ తారీఖు రాత్రి కొన్నిచోట్ల ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోస్ వేసారు. హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య థియేటర్లో ఈ సినిమా చూడటానికి అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో పాటు వచ్చాడు. ఈ థియేటర్ కి అల్లు అర్జున్ రావడంతో అధిక సంఖ్యలో ప్రేక్షకులు అభిమానులు థియేటర్ కు వచ్చేశారు. అక్కడ ఊహించిన విధంగా తొక్కిసలాట జరిగింది. రేవతి అనే ఒక మహిళ చనిపోయారు. తన బాబు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.
అయితే ఈ విషయం తెలిసిన వెంటనే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ సంస్థ కూడా సంతాపం తెలియజేశారు. ఆ తర్వాత ఏకంగా అల్లు అర్జున్ స్పందిస్తూ మూడు నిమిషాల పాటు ఉండే ఒక వీడియోను విడుదల చేశాడు. ఆ కుటుంబానికి సంబంధించి అన్ని బాధ్యతలు తాను తీసుకుంటానని, ప్రస్తుతానికి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి నష్టపరిహారంగా అందజేస్తాను అని తెలియజేశాడు. అయితే పోలీసులు చర్యలు తీసుకొని సంధ్య థియేటర్ చెందిన యాజమాన్యాన్ని అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసుకి ముగింపు పలికారు అనుకున్న తరుణంలోని మరో ట్విస్ట్ ఎదురయింది. ఏకంగా అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కి చేరగానే అల్లు అర్జున్ మీద పలు రకాల సెక్షన్ లపై కేసును పెట్టబోతున్నట్లు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక పుష్ప 2 సినిమా విషయానికి వస్తే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది. ఎలివేషన్స్ మరియు ఎమోషన్స్ తో సుకుమార్ ఈ సినిమాని డిజైన్ చేసిన విధానం అద్భుతం. ఇకపోతే అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పుష్ప 2 సినిమాలో పుష్పరాజు మనుషులను పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లినప్పుడు పోలీస్ స్టేషన్ కి డబ్బులు పట్టుకెళ్ళి ప్రతి పోలీసు ని కొంటుంటాడు పుష్ప రాజు. కేవలం వాళ్లకి జీతాలు మాత్రమే ఇవ్వకుండా రిటైర్ అయిపోయిన తర్వాత పెన్షన్ కూడా ఎంత వస్తుందో కనుక్కొని మరి డీల్ చేస్తాడు స్టేషన్ లో కూర్చుని. సినిమాలో మాదిరిగానే ఇప్పుడు రియల్ లైఫ్ లో కూడా అలానే డబ్బులు పెట్టి చట్టాన్ని పోలీసులు ని కొని పుష్పరాజు బయటకు వస్తాడా అని కొంతమంది చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక అల్లు అర్జున్ కేసు ఎన్ని మలుపులు తిరగనుందో ముందు ముందు తెలియనుంది.