E-Paper
Advertisement

300 ఏళ్లుగా సూపర్ సక్సెస్.. కేరళ ‘కావి’ ఫ్లోరింగ్‌తో.. ఇల్లు ఎప్పుడూ కూలే!

300 ఏళ్లుగా సూపర్ సక్సెస్.. కేరళ ‘కావి’ ఫ్లోరింగ్‌తో.. ఇల్లు ఎప్పుడూ కూలే!
Advertisement

Kavi Flooring: ఖరీదైన మార్బుల్స్, మోడరన్ టైల్స్, కళ్లు మిరుమిట్లు గొలిపే ఇంటీరియర్స్.. ప్రస్తుతం కొత్త ఇళ్లల్లో కనిపిస్తున్న ట్రెండ్ ఇది. అయితే ఎండకాలం వచ్చిందంటే చాలు ఈ అధునాతన ఇళ్లు సైతం నిప్పుల కొలిమిలా మారిపోవాల్సిందే. ఎంతటి ఖరీదైన గోడలు అయినా సెగలు కక్కుతూ ఇంటిని అగ్నిగుండంలా మార్చేస్తుంటాయి. దీంతో ఏసీలు, కూలర్లు లేనిది క్షణం కూడా గడవని పరిస్థితి ప్రస్తుతం చాలా ఇళ్లల్లో కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో కేరళకు చెందిన 300 ఏళ్ల నాటి ఒక సాంప్రదాయ నిర్మాణ శైలి.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ అది ఏంటి? ఇంటిని చల్లగా మార్చడంలో దాని పాత్ర ఎంత? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

‘కావి ఫ్లోరింగ్’ అంటే ఏమిటి?

‘కావి’ అనేది ఎరుపు లేదా కాషాయ రంగులో ఉండే ఒక సహజసిద్ధమైన మట్టి ఖనిజం (Red Ochre). కేరళలోని పురాతన నాలూకెట్టు (సాంప్రదాయ ఇళ్లు), రాజప్రాసాదాలు, దేవాలయాలలో ఈ తరహా ఫ్లోరింగ్‌ను మనం చూడవచ్చు. సిమెంట్, కావి పొడి, కొబ్బరి పీచు రసం, బెల్లం వంటి సహజసిద్ధమైన పదార్థాలను కలిపి ఈ మిశ్రమాన్ని తయారు చేస్తారు. దీనిని నేలపై పరిచి, చేత్తో పాలిష్ చేస్తారు.

దీని ప్రత్యేకత ఏంటంటే?

Advertisement

ఈ కావి ఫ్లోరింగ్ కు ఉన్న ప్రధాన గుణం థర్మల్ ఇన్సులేషన్ అని చెబుతారు. వేసవి కాలంలో ఎంతటి తీవ్రమైన ఎండలు ఉన్నా.. ఈ నేలలు విపరీతమైన చల్లదనాన్ని ఇస్తాయి. దీనిపై నడిస్తే ఏసీ గదిలో ఉన్న అనుభూతి కలుగుతుంది. రసాయనాలు లేని సహజ పదార్థాలతో చేయడం వల్ల ఇది పర్యావరణానికి, మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. కారి ఫ్లోరింగ్ ను ఒకసారి ఇంట్లో వేస్తే.. వందల సంవత్సరాల పాటు ఇది చెక్కుచెదరకుండా ఉంటుందట. కాలం గడిచేకొద్దీ దీని మెరుపు మరింత పెరుగుతుందని కూడా కేరళవాసులు చెబుతున్నారు.

Also Read: ఏసీ యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ WHO ఫార్ములాతో.. 70% కరెంటు బిల్లు ఆదా!

ఆధునిక బిల్డర్ల రీ-థింకింగ్

Advertisement

ప్రస్తుతం మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా.. చాలా మంది పర్యావరణ హితమైన (Eco friendly) ఇళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగాన్ని, కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఈ 300 ఏళ్ల నాటి సాంకేతికత అద్భుతంగా పనికొస్తుందని ఆధునిక ఆర్కిటెక్ట్‌లు గుర్తిస్తున్నారు. అదే సమయంలో పాతతరం పద్ధతులే ప్రస్తుత కాలానికి సరైన పరిష్కారాలని ‘కావి’ ఫ్లోరింగ్ సైతం నిరూపిస్తోంది. దీనికితోడు పాత సాంప్రదాయాలకు ఆధునికతను జోడించి నిర్మించే ఇళ్లకు ప్రస్తుతం క్రేజ్ పెరుగుతున్నందున బిల్డర్ల చూపు కావి ఫ్లోరింగ్ పై పడింది. దీంతో బిల్డర్లు తాము చేపట్టబోయే నిర్మాణాలకు కావీ ఫ్లోరింగ్ ను చాలా చోట్ల ప్రిఫర్ చేస్తుండటం విశేషం.

Also Read: మహిళా బిల్లుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు, తాము సిద్ధమేనని వ్యాఖ్య

Related News

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

Big Stories

Advertisement
×