E-Paper
Advertisement

పనుల్లో పడి నీళ్లు తాగడం మర్చిపోతున్నారా? గుర్తు చేసే.. బాటిల్స్ ఇవిగో!

పనుల్లో పడి నీళ్లు తాగడం మర్చిపోతున్నారా? గుర్తు చేసే.. బాటిల్స్ ఇవిగో!
Advertisement

Best Smart water bottles:  నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీస్ పని ఒత్తిడి వల్ల లేదా ఇతర కారణాల వల్ల చాలా మంది సమయానికి నీళ్లు తాగడం మర్చిపోతున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల డీహైడ్రేషన్, అలసట, కిడ్నీ సమస్యలు, తలనొప్పి వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సమస్యకు టెక్నాలజీ ఒక చక్కని పరిష్కారాన్ని కనిపెట్టింది.. అదే స్మార్ట్ వాటర్ బాటిల్స్. మనం ఎప్పుడు నీళ్లు తాగాలో, ఎంత పరిమాణంలో తాగాలో గుర్తు చేసే అద్భుతమైన ఫీచర్లు వీటిల్లో ఉన్నాయి.మార్కెట్లో ట్రెండ్ అవుతున్న  5 బెస్ట్ స్మార్ట్ వాటర్ బాటిల్స్ వివరాలు, వాటి ధరల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

నీళ్లు తాగాలని రిమైండ్ చేసే.. 5 బెస్ట్ స్మార్ట్ బాటిల్స్

Advertisement

1.HidrateSpark PRO (హైడ్రేట్ స్పార్క్ ప్రో , ఈక్వా స్మార్ట్ బాటిల్స్):
స్మార్ట్ బాటిల్స్ లో లగ్జరీ మోడల్ హైడ్రేట్ స్పార్క్ ప్రో (HidrateSpark PRO). ఈ బాటిల్ కింది భాగంలో ఒక స్మార్ట్ ఎల్‌ఈడీ సెన్సార్ గ్లో ఉంటుంది. మనం నీళ్లు తాగాల్సిన సమయం రాగానే ఇది లైట్ వెలుగుతూ మనల్ని అలర్ట్ చేస్తుంది. దీని బ్లూటూత్ ఫీచర్ ద్వారా మన ఫోన్‌లోని యాప్‌కి కనెక్ట్ చేసుకుని, రోజంటా మనం ఎన్ని నీళ్లు తాగామో ట్రాక్ చేయవచ్చు. ప్రీమియం క్వాలిటీతో వచ్చే ఈ బాటిల్ ధర మార్కెట్లో సుమారు రూ.6,500 నుంచి 7,500 వరకు ఉంటుంది. దీంతో పాటు ఈక్వా స్మార్ట్ వాటర్ బాటిల్ (EQUA Smart Water Bottle) కూడా చాలా స్టయిలిష్ డిజైన్‌తో వస్తుంది.ఇది బాటిల్‌ను మెల్లగా తట్టినప్పుడు మన హైడ్రేషన్ స్టేటస్‌ను లైట్ సిగ్నల్ ద్వారా చూపిస్తుంది. దీని ప్రస్తుత ధర సుమారు రూ.4,200 వరకు ఉంది.

2.Philips GoZero( ఫిలిప్స్ గోజీరో స్మార్ట్):
ఫిలిప్స్ గోజీరో స్మార్ట్ బాటిల్ (Philips GoZero Smart) చాలా స్పెషల్. ఇది కేవలం నీళ్లు తాగాలని గుర్తు చేయడమే కాకుండా.. ఇందులో ఉండే యూవీ-సీ (UV-C) ఎల్‌ఈడీ టెక్నాలజీ ద్వారా బాటిల్‌లో ఉన్న నీటిని కేవలం 60 సెకన్లలో శుద్ధి చేస్తుంది. అంటే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపేసి మనకు స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తుంది. ఈ సూపర్ ఫీచర్ ఉన్న ఫిలిప్స్ స్మార్ట్ బాటిల్ ధర సుమారు రూ.3,500 నుంచి రూ. 4,000 వరకు ఉంది. ఇక టెక్నాలజీని మరింత ఇష్టపడే వారి కోసం డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన బ్లెండ్ క్యూ (Blendqa Smart Bottle) మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉండే ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా బాటిల్ లోపల ఉన్న నీటి ఉష్ణోగ్రత (టెంపరేచర్) ఎంతో కూడా మనం లైవ్‌లో చూసుకోవచ్చు. దీని మార్కెట్ ధర సుమారు రూ.2,400 నుంచి రూ. 2,900 వరకు నడుస్తోంది.

Advertisement

3.Noova Smart Bottle(నోవా స్మార్ట్ బాటిల్):
ఇక బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారి కోసం నోవా స్మార్ట్ వాటర్ బాటిల్ (Noova Smart Bottle) ఒక అద్భుతమైన ఆప్షన్. ఇది ప్రతి గంటకు ఒకసారి చిన్న మ్యూజిక్ లేదా బీప్ శబ్దంతో పాటు లైట్ వెలుగుతూ మనకు వాటర్ రిమైండర్ ఇస్తుంది. దీని ప్రస్తుత ధర మార్కెట్లో కేవలం రూ.1,800 నుంచి రూ. 2,200 లోపే అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ బాటిల్స్ అన్నీ రీచార్జబుల్ బ్యాటరీలతో వస్తాయి. ఇవి ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం నుంచి పది రోజుల వరకు పనిచేస్తాయి. వీటి బాడీని ప్రీమియం స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేయడం వల్ల లోపల ఉన్న వేడి నీళ్లు వేడిగా.. చల్లటి నీళ్లు చల్లగా రోజంతా అలాగే ఉంటాయి. జిమ్‌కి వెళ్లే వారికి, స్పోర్ట్స్ పర్సన్స్‌కు ,ఆఫీస్ ఉద్యోగులకు ఇవి చాలా బాగా సెట్ అవుతాయి.

Also Read: ఈఫ్యాన్లతో క్షణాల్లోనే.. ఇల్లంతా కూల్ కూల్!

ఆరోగ్యంగా ఉండటానికి రోజూ సరైన మొత్తంలో నీళ్లు తాగడం ఎంతైనా అవసరం. బిజీగా ఉంటూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే వారికి ఈ స్మార్ట్ వాటర్ బాటిల్స్ ఒక పర్సనల్ హెల్త్ అసిస్టెంట్‌లా సహాయపడతాయి. స్మార్ట్ వాచ్ లేదా మొబైల్ యాప్స్‌తో వీటికి కనెక్టివిటీ ఉండటం వల్ల మన రోజువారీ వాటర్ గోల్స్‌ను ఈజీగా రీచ్ అవ్వొచ్చు. సాధారణ బాటిళ్లతో పోలిస్తే వీటి ధర కొద్దిగా ఎక్కువ ఉన్నప్పటికీ, మన ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇవి పెట్టే ఖర్చుకు పూర్తి న్యాయం చేస్తాయి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లలో నడిచే బ్యాంక్ ఆఫర్ల ద్వారా వీటిని ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ డిజిటల్ కాలంలో మీకోసం లేదా మీ ఆత్మీయుల కోసం ఒక మంచి స్మార్ట్ వాటర్ బాటిల్‌ను ఎంచుకుని ఎల్లప్పుడూ హెల్తీగా, హైడ్రేటెడ్‌గా ఉండండి.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×