E-Paper
Advertisement

మనుషుల ఎముకలతో కట్టిన చర్చి.. లోపలి దృశ్యాలు చూస్తే వణికిపోవాల్సిందే!

మనుషుల ఎముకలతో కట్టిన చర్చి.. లోపలి దృశ్యాలు చూస్తే వణికిపోవాల్సిందే!
Advertisement

Bone Church: సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఇటుకలు, సిమెంట్, ఇసుక కావాలి. మహా అయితే కొంచెం డిజైన్ కోసం మార్బుల్స్ వాడుతాం. కానీ ఎవడికో బోర్ కొట్టినట్టుంది.. ‘ఇవన్నీ రొటీన్ రా బాబు, కొత్తగా ట్రై చేద్దాం’ అనుకున్నాడు. ఇంకేముంది.. ఏకంగా మనుషుల ఎముకలు, పుర్రెలతోనే ఒక చర్చి కట్టేశాడు! వినడానికే ఒళ్లు కంపరం అంటోంది కదూ? అవును, రాత్రిపూట ఒంటరిగా ఈ చర్చి లోపలి దృశ్యాలు చూస్తే గుండె జారి గల్లంతవ్వడం ఖాయం. ఇంతకీ ఎక్కడుంది ఈ వింత చర్చి? దీని వెనుక ఉన్న కథేంటో ఓసారి చూద్దాం రండి!

ఈ ‘బోన్ చర్చి’ ఎక్కడుంది?

Advertisement

ఈ భయంకరమైన, వింతైన చర్చి పేరు ‘సెడ్లెక్ అసువరీ’ (Sedlec Ossuary). ఇది యూరప్‌లోని చెక్ రిపబ్లిక్ దేశంలో, ప్రేగ్ నగరానికి కాస్త దూరంలో ఉన్న కుట్నా హోరా అనే ప్రాంతంలో ఉంది. బయట నుంచి చూస్తే ఇదో మామూలు పాతకాలపు చర్చిలాగే కనిపిస్తుంది. కానీ లోపలికి అడుగుపెట్టగానే సీన్ మొత్తం మారిపోతుంది. హాలీవుడ్ హారర్ సినిమా సెట్‌లోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.

నలభై వేల మంది అస్థిపంజరాలు!

Advertisement

ఈ చర్చిని డెకరేట్ చేయడానికి ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 40,000 నుండి 70,000 మంది మనుషుల ఎముకలను వాడారు. గోడలు, సీలింగ్, చివరికి అక్కడ ఉన్న ఫర్నిచర్ కూడా ఎముకలతోనే చేసేశారు. ఇక్కడ ఉన్న ఒక భారీ ‘షాన్డిలియర్’ (Chandelier) అయితే ఈ చర్చి మొత్తానికి హైలైట్. మనిషి శరీరంలో ఉండే ప్రతి ఒక్క ఎముకనూ ఉపయోగించి ఆ గ్లామర్ లైట్‌ను డిజైన్ చేశారు. చూస్తే అరాచకంగా ఉన్నా, ఆ కళాఖండం వెనుక ఉన్న ఓపికను మెచ్చుకోకుండా ఉండలేం.

ఎముకలతో చర్చి ఎందుకు కట్టారు?

14వ శతాబ్దంలో అక్కడ ‘ప్లేగ్’ వ్యాధి వల్ల, ఆ తర్వాత జరిగిన యుద్ధాల వల్ల వేల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. వాళ్ళందరినీ చర్చి పరిసరాల్లోనే పాతిపెట్టారు. కాలక్రమేణా శవాల సంఖ్య ఎక్కువైపోయి, స్థలం సరిపోక ఎముకలన్నింటినీ తవ్వి బయటకు తీశారు. వాటిని ఏం చేయాలో తెలియక చర్చి బేస్‌మెంట్‌లో పడేశారు. 1870లో ‘ఫ్రాంటిసెక్ రింట్’ అనే ఒక చెక్క శిల్పికి ఈ ఎముకలను ఒక పద్ధతిలో అమర్చే బాధ్యత అప్పగించారు. ఆ మహానుభావుడు తన క్రియేటివిటీ అంతా వాడి, ఆ ఎముకలనే చర్చికి ఇంటీరియర్ డిజైన్‌గా మార్చేశాడు!

బోన్ చర్చి ముఖ్య ఉద్దేశం

చూడడానికి ఇది భయంకరంగా ఉన్నా.. దీని వెనుక ఒక లోతైన సందేశం ఉంది. ‘మనం ఎంత సంపాదించినా, ఎంత అందంగా ఉన్నా.. చివరికి మిగిలేది ఈ బూడిద, ఎముకలే’ అని చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది పర్యాటకులు ఈ వింత చర్చిని చూడటానికి వస్తుంటారు. మీకు ధైర్యం ఎక్కువైతే, మీ లిస్ట్‌లో ఈ ప్లేస్‌ను కూడా యాడ్ చేసుకోండి!

Also Read: థాయ్‌ లాండ్, బాలి ఎందుకు దండగ.. భారత్‌ లోనే వాటిని తలదన్నే టూరిస్ట్ స్పాట్స్ ఉండగా!

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×