E-Paper
Advertisement

పాత కూలర్ కొంటున్నారా? ఈ 5 విషయాలు చెక్ చేయకపోతే మోసపోవడం ఖాయం

పాత కూలర్ కొంటున్నారా? ఈ 5 విషయాలు చెక్ చేయకపోతే మోసపోవడం ఖాయం
Advertisement

Second hand cooler: ఎండల నుంచి తప్పించుకోవడానికి కొత్త కూలర్ కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో సెకండ్ హ్యాండ్ లేదా పాత కూలర్లను కొనడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. అయితే.. పాత కూలర్ బయటకు బాగానే కనిపించినా.. లోపల మోటార్ లేదా బాడీ కండిషన్ ఎలా ఉందో తెలియడం కష్టం. తక్కువ ధరలో మంచి కూలర్ ఎంచుకోవడానికి.. మీ డబ్బు వృధా కాకుండా ఉండటానికి మీరు చెక్ చేయాల్సిన 5 కీలకమైన విషయాలను వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవి కాలం వస్తే చాలు కూలర్ల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. అందుకే బడ్జెట్ తక్కువగా ఉన్నవారు పాత కూలర్ల వైపు మొగ్గు చూపుతారు. కానీ పాత ఎలక్ట్రానిక్ వస్తువులను కొనేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఐరన్ బాడీ కూలర్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాపాయం కూడా ఉండవచ్చు.

Advertisement

పాత కూలర్ కొనే ముందు ఈ విషయాలు తెలుసుకోండి: 

1. బాడీ కండిషన్, తుప్పు:
పాత కూలర్ కొనేటప్పుడు మొదట చూడాల్సింది దాని బాడీ. ఐరన్ కూలర్ అయితే అడుగు భాగంలో ఏమైనా రంధ్రాలు పడ్డాయేమో లేదా విపరీతంగా తుప్పు పట్టిందో లేదో చెక్ చేయండి. నీరు నిల్వ ఉండే చోట పెయింట్ ఊడిపోయి తుప్పు పడితే.. కొద్ది రోజుల్లోనే అది లీక్ అవ్వడం మొదలవుతుంది. ప్లాస్టిక్ కూలర్ అయితే ఎక్కడైనా పగుళ్లు ఉన్నాయేమో పరిశీలించండి.

Advertisement

2. మోటార్ , ఫ్యాన్ బ్లేడ్స్:
కూలర్‌కు ప్రాణం లాంటిది మోటార్. కూలర్ ఆన్ చేసినప్పుడు మోటార్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయా లేదా అని గమనించండి. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు వైబ్రేషన్ ఎక్కువగా ఉంటే మోటార్ బేరింగ్లు పోయాయని అర్థం.అలాగే ఫ్యాన్ స్పీడ్ వేరియేషన్ కంట్రోల్స్ సరిగ్గా పని చేస్తున్నాయో లేదో స్విచ్ తిప్పి చూడండి. మోటార్ వేడెక్కుతుంటే అది త్వరలో కాలిపోయే అవకాశం ఉందని గుర్తించాలి.

3. వాటర్ పంప్, వైరింగ్:
కూలర్ లోపల ఉండే వాటర్ పంప్ సరిగ్గా నీటిని పైకి పంపిస్తోందో లేదో చూడండి. పంప్ ఆన్ చేసినప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి దాని కండిషన్ అంచనా వేయవచ్చు. అంతకంటే ముఖ్యంగా వైరింగ్ ఎలా ఉందో గమనించండి. పాతబడిన వైర్ల వల్ల కరెంట్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. బాడీకి కరెంట్ వస్తుందో లేదో టెస్టర్‌తో చెక్ చేయడం బెస్ట్.

Also Read:  మీ ఫోన్ విపరీతంగా వేడెక్కుతోందా? బ్యాటరీ పేలకుండా వెంటనే ఇలా చేయండి!

4. హనీకోంబ్ లేదా గడ్డి ప్యాడ్లు:
కూలర్ ప్యాడ్లు పాతబడిపోయి దుమ్ముతో నిండిపోతే గాలి చల్లగా రాదు. నాచు పట్టిన ప్యాడ్ల వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు పాత కూలర్ కొనేటప్పుడు ఆ ప్యాడ్లను మార్చాల్సి వస్తే.. దానికి అయ్యే అదనపు ఖర్చును కూడా బేరమాడేటప్పుడు పరిగణనలోకి తీసుకోండి.

5. శబ్దం, గాలి వేగం :
కొన్ని పాత కూలర్లు విపరీతమైన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇది రాత్రిపూట నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే గాలి ఫోర్స్ ఎంతవరకు ఉందో చూడండి. గది పరిమాణానికి సరిపడా గాలిని అది ఇస్తుందా లేదా అనేది చెక్ చేయాలి.

పాత కూలర్ కొనేటప్పుడు యజమానిని అది ఎన్ని ఏళ్ల క్రితం కొన్నారో అడగండి. వీలైతే వారంటీ కార్డు ఉంటే చూడండి. పైన చెప్పిన 5 విషయాలను క్షుణ్ణంగా చెక్ చేస్తే, మీరు తక్కువ ధరలో మంచి సెకండ్ హ్యాండ్ కూలర్‌ను సొంతం చేసుకోవచ్చు.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×