E-Paper
Advertisement

ఏసీలో వింత శబ్దాలు వస్తున్నాయా? కారణం ఇదే కావొచ్చు.. జాగ్రత్త భయ్యో!

ఏసీలో వింత శబ్దాలు వస్తున్నాయా? కారణం ఇదే కావొచ్చు.. జాగ్రత్త భయ్యో!
Advertisement

Air Conditioner Problems: ప్రస్తుత వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. గతంలో లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ప్రజలను ఏసీలను ఆన్ చేస్తూ.. చల్లటి గాలిలో ఉపశమనం పొందుతున్నారు. అయితే కొందరికి ఏసీ ఆన్ చేస్తే చల్లటి గాలికి బదులు వేడి గాలి వస్తుంటుంది. దానికి తోడు ఏసీ నుంచి వింత వింత శబ్దాలు సైతం వినిపిస్తుంటాయి. అయితే దీనికి ప్రధాన కారణం గ్యాస్ లీకేజీ అని నిపుణులు అంటున్నారు. అయితే టెక్నిషియన్ తో పనిలేకుండానే ఏసీ నుంచి గ్యాస్ లీక్ అవుతుందని సులభమైన సంకేతాల ద్వారా కనిపెట్టవచ్చని పేర్కొంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

వేడి గాలి రావడం

ఏసీ రిమోట్‌లో టెంపరేచర్ 18 లేదా 20 డిగ్రీలు పెట్టినా కూడా గది చల్లబడటానికి ప్రధాన కారణం గ్యాస్ లీకేజీ లేదా తక్కువగా ఉండటమే కారణం కావొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి సంకేతాలు ఏసీలో కనిపిస్తే టెక్నిషియన్ ను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఏసీ పైపులపై మంచు

Advertisement

ఏసీ అవుట్ డోర్ యూనిట్ కు కనెక్ట్ అయ్యే రాగి పైపులపై తెల్లటి మంచు గడ్డకట్టి ఉంటే కూడా గ్యాస్ లీక్ అవుతుందని అర్థం. గ్యాస్ ప్రెజర్ తగ్గినప్పుడు ఇండోర్ యూనిట్‌లోని ఎవాపరేటర్ కాయిల్స్ కూడా గడ్డకట్టే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

వింత శబ్దాలు రావడం

ఏసీ ఆన్ చేసినప్పుడు లీకేజీ ఉన్న చోట నుండి ‘హిస్స్’ అనే గాలి బుసలు కొడుతున్నట్లు లేదా ఏదో బబ్లింగ్ అవుతున్నట్లు వింత శబ్దాలు వస్తుంటాయి. ఇలాంటి శబ్దాలు వస్తే గ్యాస్ లీకేజ్ చాలా ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కరెంట్ బిల్లు పెరగడం

Advertisement

గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు గదిని చల్లబరచడానికి ఏసీలోని కంప్రెసర్ నిరంతరాయంగా ఎక్కువ సేపు పనిచేస్తుంటుంది. దీనివల్ల కరెంట్ బిల్లు ఊహించని విధంగా భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. గత నెల కంటే ఎక్కువగా పవర్ బిల్లు వస్తే.. ఏసీ గ్యాస్ లీకేజీకి సంకేతంగా భావించాలని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: Central vs Split AC: ఏసీ నెత్తిన ఉంటే మంచిదా? గోడకు ఉంటే బెటరా? ఇంటికి ఏది బెస్ట్!

ఫైనల్గా ఏం చేయాలి?

ఏసీలో గ్యాస్ లీక్ అయిందని పైన పేర్కొన్న సంకేతాల ద్వారా కన్ఫర్మ్ అయితే.. స్వయంగా గ్యాస్ నింపడానికి ప్రయత్నించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీ గ్యాస్ కెమికల్స్‌తో కూడుకున్నదని పేర్కొంటున్నారు. కాబట్టి వెంటనే మంచి ప్రొఫెషనల్ ఏసీ టెక్నీషియన్‌ను పిలిపించి లీకేజీని రిపేర్ చేయించాలని హితవు పలుకుతున్నారు. ఆ తర్వాతే కొత్త గ్యాస్ ఫిల్ చేయించాలని సలహా ఇస్తున్నారు.

Also Read: ACల కంటే పవర్‌ఫుల్ గ్యాడ్జెటా? కరెంట్ ఆదా చేస్తూ ప్రకృతిని కాపాడే ఈ Heat Pumps కథేంటి?

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×