E-Paper
Advertisement

ఏసీ సర్వీసింగ్ చేయించినా రూమ్ చల్లబడటం లేదా? అయితే ఇవే కారణం కావచ్చు

ఏసీ సర్వీసింగ్ చేయించినా రూమ్ చల్లబడటం లేదా? అయితే ఇవే కారణం కావచ్చు
Advertisement

AC Cooling Problems: ఎండల నుంచి ఉపశమనం కోసం ఏసీ ఆన్ చేస్తే.. అది కూడా ఫ్యాన్ లాగా గాలిని ఇస్తూ గదిని చల్లబరచకపోతే చాలా విసుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వందల రూపాయలు ఖర్చు చేసి సర్వీసింగ్ చేయించిన తర్వాత కూడా ఇదే సమస్య ఎదురైతే.. ఎక్కడో ఏదో లోపం ఉందని అర్థం. చాలా సార్లు మెకానిక్‌లు పైపైన క్లీన్ చేసి వెళ్ళిపోతుంటారు. కానీ లోపల ఉన్న సాంకేతిక సమస్యలు అలాగే ఉండిపోతాయి. కస్టమర్లు తరచుగా ఎదుర్కొనే ఈ ఏసీ కూలింగ్ సమస్యలకు గల లోతైన కారణాలను, వాటి పరిష్కార మార్గాలను ఇప్పుడు వివరంగా చూద్దాం.

ఏసీ సర్వీసింగ్ తర్వాత కూడా కూలింగ్ రాకపోవడానికి ప్రధాన కారణాలు:

1. ఏసీ గ్యాస్ లీకేజీ :
సర్వీసింగ్ సమయంలో గ్యాస్ లెవల్స్ చెక్ చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఏసీలో గ్యాస్ తక్కువగా ఉంటే కంప్రెసర్ ఎంత గాలి చల్లగా మారదు. ఒకవేళ మీ ఏసీ ఇండోర్ యూనిట్ దగ్గర ఐస్ గడ్డకట్టి ఉంటే.. అది ఖచ్చితంగా గ్యాస్ లీకేజీకి సంకేతం. ఇది సర్వీసింగ్ ద్వారా పోదు.. దానికి గ్యాస్ టాప్-అప్ లేదా లీక్ రిపేర్ అవసరం.

Advertisement

2. కంప్రెసర్ సమస్యలు:
ఏసీకి కంప్రెసర్ అనేది గుండె లాంటిది. ఒక్కో సారి వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల లేదా కెపాసిటర్ పాడవ్వడం వల్ల కంప్రెసర్ ట్రిప్ అవుతూ ఉంటుంది. సర్వీసింగ్ కేవలం క్లీనింగ్ మాత్రమే.. అది కంప్రెసర్ లోపల ఉన్న ఎలక్ట్రికల్ సమస్యలను పరిష్కరించదు. కంప్రెసర్ ఆన్ అయ్యేటప్పుడు వచ్చే ‘క్లిక్’ శబ్దాన్ని గమనించండి.

3. డర్టీ కండెన్సర్ కాయిల్స్ :
మీరు ఏసీ లోపల ఉన్న ఫిల్టర్లను క్లీన్ చేసి ఉండొచ్చు. కానీ బయట ఉండే అవుట్ డోర్ యూనిట్ కాయిల్స్ మధ్యలో దుమ్ము పేరుకుపోయి ఉంటే వేడి బయటకు పోదు. దీని వల్ల ఏసీ గదిని చల్లబరచడానికి చాలా ఇబ్బంది పడుతుంది.సర్వీసింగ్ చేసేటప్పుడు అవుట్ డోర్ యూనిట్‌ను వాటర్ ప్రెషర్‌తో శుభ్రం చేశారో లేదో ఒకసారి సరిచూసుకోండి.

Advertisement

4. థర్మోస్టాట్ సెట్టింగ్స్ లో పొరపాట్లు :
ఒక్కోసారి సమస్య ఏసీలో ఉండదు. మనం సెట్ చేసే రిమోట్ సెట్టింగ్స్‌లో ఉంటుంది. ఏసీ పొరపాటున ‘Fan Mode’ లేదా ‘Dry Mode’ లో ఉంటే కూలింగ్ రాదు. ఎప్పుడూ ‘Cool Mode’ లో ఉంచి.. ఉష్ణోగ్రతను 24°C వద్ద సెట్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

5. గది పరిమాణం, ఇన్సులేషన్ :
మీ గది కిటికీలు లేదా తలుపులు సరిగ్గా మూసి లేకపోయినా.. లేదా గది గోడలకు నేరుగా ఎండ తగులుతున్నా ఏసీ కూలింగ్ సరిపోదు. అలాగే మీ రూమ్ సైజుకు తగ్గ టన్ను ఏసీ లేకపోయినా సర్వీసింగ్ చేసినా ఉపయోగం ఉండదు.

సమస్యను ఎలా పరిష్కరించాలి?
గాలి లీకేజీని అరికట్టండి: గదిలో చల్లటి గాలి బయటకు పోకుండా కిటికీలు, తలుపుల సందులను థర్మాకోల్ లేదా రబ్బర్ స్ట్రిప్స్‌తో మూసివేయండి.

రిమోట్ రీసెట్: ఒక్కోసారి రిమోట్ సెట్టింగ్స్ కన్ఫ్యూజ్ అయితే.. బ్యాటరీలు తీసి మళ్ళీ వేసి రీసెట్ చేయండి.

Also Read: బీఎల్డీసీ Vs రెగ్యులర్ ఫ్యాన్.. కరెంట్ బిల్లును సగానికి తగ్గించే ఫ్యాన్ ఏది?

అవుట్ డోర్ యూనిట్ స్థానం: మీ ఏసీ అవుట్ డోర్ యూనిట్ చుట్టూ గాలి ఆడేలా చూడండి. దానిపై నేరుగా ఎండ పడకుండా షెడ్ లాంటిది ఏర్పాటు చేస్తే కూలింగ్ 20% పెరుగుతుంది.

మెకానిక్‌ను అడగాల్సిన ప్రశ్నలు: సర్వీసింగ్ తర్వాత కూలింగ్ లేకపోతే.. మెకానిక్‌ను పిలిచి ‘గ్రిల్ టెంపరేచర్’ చెక్ చేయమని అడగండి.

ఏసీ సర్వీసింగ్ అనేది కేవలం దుమ్ము దులపడం మాత్రమే కాదు.. అది ఒక హెల్త్ చెకప్ లాంటిది. పైన చెప్పిన కారణాలను గమనించి, సరైన టెక్నీషియన్‌తో సమస్యను గుర్తించడం ద్వారా మీరు ఈ వేసవిలో హాయిగా చల్లటి గాలిని ఆస్వాదించవచ్చు. గుర్తుంచుకోండి.. కరెంట్ బిల్లు తగ్గాలన్నా, ఏసీ లైఫ్ పెరగాలన్నా సరైన మెయింటెనెన్స్ తప్పనిసరి.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×