E-Paper
Advertisement

బీటెక్ పాసైన వారికి అద్భుతమైన అవకాశం.. NPCIL‌లో ఉద్యోగాలు, లాస్ట్ డేట్ ఇదే

బీటెక్ పాసైన వారికి అద్భుతమైన అవకాశం.. NPCIL‌లో ఉద్యోగాలు, లాస్ట్ డేట్ ఇదే
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) ముంబయి కేంద్రంగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 330 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో కెరీర్ ప్రారంభించాలని ఆశించే యువ ఇంజినీర్లకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. గేట్ (GATE) స్కోర్ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 330

Advertisement

ఈ నోటిఫికేషన్ ద్వారా మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్ విభాగాలతో పాటు ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ వంటి ప్రధాన విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తారు.

విద్యార్హత: దరఖాస్తుదారులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. విద్యాార్హతతో పాటు చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ తప్పనిసరి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు అణుశక్తి రంగంపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత లభిస్తుంది.

Advertisement

వయస్సు:  వయోపరిమితి విషయంలో నోటిఫికేషన్ స్పష్టమైన నిబంధనలు విధించింది. ఏప్రిల్ 30, 2026 నాటికి అభ్యర్థుల వయసు 26 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు అలాగే ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వరకు మినహాయింపు ఉంటుంది.

స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులు శిక్షణా కాలంలో స్టైపెండ్ పొందుతారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత సంస్థలో శాశ్వత ప్రాతిపదికన నియమితులవుతారు.

దరఖాస్తు విధానం:  దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు సహా మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు కల్పించారు.

ముఖ్యమైన తేదీలు: అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీ లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. చివరి నిమిషంలో సర్వర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ముందే దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం అని అధికారులు చెబుతున్నారు.

దేశ ఇంధన భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న ఎన్‌పీసీఐఎల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేయడం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. శిక్షణ కాలంలో ఇచ్చే ప్రోత్సాహకాలు అలాగే ఉద్యోగ భద్రత వంటి అంశాలు అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.npcilcareers.co.in

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 330

దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 30

ALSO READ: ఇండియన్ బ్యాంక్‌లో 350 ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, ఇంకెందుకు ఆలస్యం!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×